షీ టీమ్ కానిస్టేబుల్ కే టార్చర్.. పోర్న్ సైట్ లో ఫోన్ నంబర్ | SHE Team Lady Constable Harassing Man Held

Woman constable harassing case solved

Woman Constable, Woman Constable Harass, Woman Constable SHE Team, SHE Team Constable, SHE Team Constable Arrested

Woman Constable from SHE Team harassed. Hyderabad Police Arrested 24 Years old Man from Warangal.

షీ టీమ్ కానిస్టేబుల్ కు వేధింపులు.. శాడిస్ట్ అరెస్ట్

Posted: 08/16/2017 10:02 AM IST
Woman constable harassing case solved

తనపై వేధింపులు జరుగుతున్నాయని, కాపాడాలంటూ షీ టీమ్ ను సాయం కోరిన అమ్మాయికి సాయం చేద్దామనుకున్న లేడీ కానిస్టేబుల్ కి షాక్ తగిలింది. ఆమెనే వేధించటం మొదలుపెట్టడం శాడిస్ట్, చివరకు ఆమె నంబర్ ను పోర్న్ సైట్ లో పెట్టేశాడు.

ఎనిమిది నెలల క్రితం రంగారెడ్డి జిల్లా మంచాలలోని ప్రతిభా డిగ్రీ కాలేజీకి చెందిన ఓ యువతికి ఓ ఫోన్ నంబర్ నుంచి అసభ్యకర సందేశాలు వచ్చాయి. ఆ ఆకతాయి నుంచి తనను కాపాడాలని కోరుతూ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌ కు సదరు యువతి మెసేజ్‌ పంపింది. దీంతో రంగంలోకి దిగిన ఏఎస్‌ఐ నరసింహ నేతృత్వంలోని షీ బృందం బాధిత యువతిని సంప్రదించగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా సమస్యను పరిష్కరించాలని కోరింది. షీ టీమ్ సభ్యురాలైన ఓ లేడీ కానిస్టేబుల్ నిందితుడి సెల్ కు తన ఫోన్ నుంచి కాల్ చేసి వివరాలు రాబట్టే యత్నం చేసింది.

అయితే ఆమె నంబర్ ను కూడా సేవ్ చేసుకున్న శాడిస్ట్ నిందితుడు అప్పటి నుంచి అసభ్య మెసేజ్ లు కానిస్టేబుల్ కు పంపంటం ప్రారంభించాడు. ఆరంభంలో పెద్దగా పట్టించుకోని కానిస్టేబుల్ రాను రాను శ్రుతి మించటంతో ఈ యేడాది మొదట్లో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కానిస్టేబుల్‌ కు వేధింపులు ఆగలేదు.

చివరకు నెల రోజుల క్రితం ఆమె సెల్ నెంబర్ ను ఓ పోర్న్‌ వెబ్‌ సైట్‌ లో అప్‌ లోడ్‌ చేయటంతో అభ్యంతరకరమైన కాల్స్ రావడం ఆరంభమైంది. దీంతో ఈ కేసును మరింత సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా వరంగల్ జిల్లా పరకాలకు చెందిన యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  SHE Team  Woman Constable  Harassing Case  

Other Articles

Today on Telugu Wishesh