డ్రగ్స్ కేసు.. సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్.. లిస్ట్ లో ఎవరెవరంటే.. | Hyderabad Drug Case SIT Probe Part 2 in September

Telangana drug case charge sheets from september

Drug Case, Hyderabad Drug Case, Drug Case Tollywood, Akun Sabharwal, Telangana Excise Department, SIT Probe, Excise SIT Probe, Drugs Case Second Part

SIT to file charge-sheets in Hyderabad Drugs Case from September Prohibition and Excise department Director (Enforcement) Akun Sabharwal Said. The SIT has arrested more than 21 people in connection with drugs case.

డ్రగ్స్ కేసు: గ్లామర్ పార్ట్ ఫినిష్?

Posted: 08/12/2017 07:47 AM IST
Telangana drug case charge sheets from september

హైదరాబాద్ నడిబొడ్డున వెలుగుచూసిన మాదక ద్రవ్యాల దందా గురించి దేశం మొత్తం చర్చించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు, సిట్ విచారణ తదితర పరిణామాల నేపథ్యంలో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే చివరి నిమిషంలో పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావటంతో ఎక్సైజ్ శాఖ తేలికగా తీసుకుందన్న వార్తల నేపథ్యంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్ స్పందించారు.

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణకు సంబంధించి తొలి భాగం పూర్తయిందని, సెప్టెంబర్ లో రెండో జాబితా ఉంటుందని తెలిపారు. తాము స్వేచ్ఛగా విచారిస్తున్నామని పేర్కొన్న ఆయన, తొలి ఎపిసోడ్ గ్లామర్ పార్ట్ విచారణ పూర్తయిందన్నారు. దాదాపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి విచారణ ముగిసినట్టేనన్న సంకేతాలు ఇచ్చేశారు. ఇక ఇప్పటివరకూ 11 కేసులు నమోదయ్యాయని, వాటిపై త్వరలో చార్జ్ షీట్ వేయనున్నామని అకున్ వెల్లడించారు.

రెండో దశ విచారణలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాధారాలు లభించినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Drugs Case  Akun Sabharwal  Charge Sheet  

Other Articles