హత్యకేసులో జడేజాకు జీవిత ఖైదు | BJP MLA gets lifer in 2004 murder case

Life sentence for gujarat bjp mla

Gujarat, Gujarat HC, Gujarat BJP MLA, BJP MLA Life Imprisonment, MLA Jayrajsinh Jadeja, MLA Jadeja, Nilesh Rayani Murder Case

Gujarat HC hands out life term to BJP MLA Jayrajsinh Jadeja, two aides for 2004 murder. The Gondal MLA Killed Nilesh in 2004.

బీజేపీ ఎమ్మెల్యేకు యావజ్జీవ శిక్ష

Posted: 08/12/2017 07:32 AM IST
Life sentence for gujarat bjp mla

గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గోండల్ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే జయరాజ్ సిన్హ్ జడేజాకు యావజ్జీవ శిక్ష విధించింది. సుమారు పదమూడేళ్ల కిందట ఓ రియల్టర్ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.

2004 లో గోండల్ లోని వారసత్వ సంపద విషయమై పటేల్, క్షత్రియ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఫిబ్రవరి 8న రియల్టర్ ఎమ్మెల్యే జడేజా, మరి కొందరు వ్యక్తులు, నీలేశ్ అనే రియల్టర్ ను కాల్చి చంపారు. దీంతో, జడేజా సహా 14 మందిపై హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో ఎమ్మెల్యే జడేజా సహా 13 మందిని నిర్దోషులుగా రాజ్ కోట్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు నిచ్చింది. సమీర్ సిరాజ్ అనే మరో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నాడు పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే జడేజా అతని ఇద్దరు అనుచరులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బెయిల్ పై ఉన్న ఈ ముగ్గురిని సెప్టెంబర్ 30 లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  High Court  BJP  MLA Jayrajsinh Jadeja  

Other Articles