వాట్సాప్.. రిస్క్ లేకుండా మనీ ట్రాన్స్ ఫర్ | Whats App will Introduce Money Transfer Feature

Money transfer through whatsapp soon

WhatsApp, WhatsApp Money Transfer, WhatsApp UPI, UPI Money Transfer, UPI New Plan, Whats app New Feature

WhatsApp will soon facilitate instant money transfer via the Unified Payments Interface (UPI) transaction system, shows a new Beta update by the Facebook-owned mobile messaging platform.

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Posted: 08/11/2017 07:34 AM IST
Money transfer through whatsapp soon

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో మరో అరుదైన ఫీచర్ ను అందించేందుకు సిద్ధం అవుతోంది. అతి త్వరలో ఈ మేసేజింగ్ యాప్ నుంచి నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశం
కల్పించబోతుంది. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న పోటీలో ముందు నిలిచేందుకు ప్రణాళిక వేస్తోంది.

వాట్సాప్ కొత్త బీటా వెర్షన్ 2.17.295లో పేమెంట్స్‌ను ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా వాట్సాప్ నుంచే నేరుగా డబ్బులు పంపించే సౌలభ్యాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటిదే, కాకపోతే హైసెక్యూరిటీ విధానంతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని వాబేటాఇన్ఫో అనే బ్లాగ్ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్బీఐ ఆధ్వర్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొబైల్ ఫ్లాట్ ఫాం ఆధారంగా రెండు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ఈ యూపీఏ విధానాన్ని గత ఆగష్టులో అందులోబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే మాత్రం పేమెంట్స్ అండ్ బ్యాంక్ నిబంధనలను యూజర్లు అంగీకరించాల్సి ఉంటుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  UPI  Money Transfer  

Other Articles