BJP emerges as largest party in Rajya Sabha పెద్దల సభలో అతిపెద్దగా అవతరించిన కమలం

Bjp overtakes congress as largest political party in rajya sabha

Rajya Sabha Elections, Parliament, sampatiya uikey, Rajya Sabha, NDA, Narendra Modi government, Congress, BJP, PM Modi, NDA

For the first time ever, the ruling BJP has become the largest party in the Rajya Sabha and is set to add a few more to its tally next year,

పెద్దల సభలో అతిపెద్దగా అవతరించిన కమలం

Posted: 08/04/2017 03:42 PM IST
Bjp overtakes congress as largest political party in rajya sabha

సముద్రమంత పెద్దదిని.. 120 ఏళ్లకు పైగా చరిత్ర వుందని బీరాలు పోయే కాంగ్రెస్‌ తన చేజేతులా తన హోదాను తానే పోగొట్టుకుంటోంది. ‘కాంగ్రెస్ ముక్త్‌ భారత్‌’ నినాదాన్ని అందుకుని తాజా పరిస్థితుల నేపథ్యంలో విపక్ష్ ముక్త్ భారత్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న కమలదళం.. అనుకున్నంత పని చేసేలా వుంది. గత 68 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తన హోదాను కొల్పయింది. పెద్దల సభగా పిలవబడే రాజ్యసభలో తమ బలాన్ని తగ్గించుకుని అతిపెద్ద పార్టీ హోదాను కోల్పోయింది. రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మధ్యప్రదేశ్ నుంచి సంపతియా వూకే గెలుపొంది.. బీజేపి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ తన హోదాను కోల్పోయింది. కేంద్ర మంత్రి అనిల్‌ దవే ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని గిరిజన వర్గానికి చెందిన నేతలతో బర్తీ చేయించేందుకు బీజేపి నిర్ణయం తీసుకుని తమ పార్టీకి చెందిన సంపతియా పూకేను బరిలోకి దింపింది. అమె విజయం సాధించిన క్రితం రోజు పెద్దల సభలోకి అడుగుపెట్టారు. దీంతో 245 స్థానాలున్న పెద్దల సభలో బీజేపీ బలం 58కి పెరిగింది. కాంగ్రెస్ బలం 57కు పరిమితమైంది.

నిజానికి ‘పెద్ద పార్టీ’గా కాంగ్రెస్‌ 2018 వరకూ కొనసాగాల్సి ఉన్నా, సభ్యుల అకాలమరణాలతో ముందుగానే రికార్డు కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మణిపూర్‌కు చెందిన హజీ అబ్దుల్‌ సలామ్‌ల మరణాలతో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల సంఖ్య 57కు పడిపోయింది. దీంతో 65 ఏళ్ల రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ, అధికార ఎన్డీఏకు పెద్దలసభలో మెజారిటీ లేకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles