traffic diversion in ameerpet mythrivanam మైత్రివనం వద్ద జాగ్రత్తా.. జంక్షన్ జామ్ అవుద్దీ..

Traffic diversion in ameerpet mythrivanam

ameerpet, mythrivanam, traffic diversion, metro rail, metro rail construction works, hyderabad police commissioner, mahender reddy, traffic police, vehicles traffic

hyderabad police commissioner requested the vehicle owners of hyderabad to co-operate with traffic diversion in ameerpet mythrivanam in lieu of metro rail construction.

మైత్రివనం వద్ద జాగ్రత్తా.. జంక్షన్ జామ్ అవుద్దీ..

Posted: 08/03/2017 04:21 PM IST
Traffic diversion in ameerpet mythrivanam

హైదరాబాద్ నగరానికి గెండెకాయలాంటి అమీర్ పేట నగరంలో ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అమీర్ పేట్ అనగానే ట్రాఫిక్ వనంలా నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈ వాహనాల రద్దీ దృష్ట్యా స్థానికంగా వేగంగా జరగాల్సిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. అయితే ఈ పనులను వేగవంతం చేయడంలో భాగంగా కొత్తగా 45 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను.. మళ్లింపులను తెరమీదకు తీసుకువచ్చారు హైదరాబాద్ పోలీసులు. మెట్రో రైల్‌ నిర్మాణ పనులను వేగిరం చేసి పనులు పూర్తి చేయనున్నారు. దీంతో అమీర్ పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్ళింపులు విధించారు. తాజా మళ్లింపుల నేపథ్యంలో వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి కోరారు.

* ఎర్రగడ్డ, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్ళే వాహనాలను ఎస్సార్ నగర్ నుంచి మళ్లింపు..
* ఫతేనగర్‌ నుంచి అమీర్ పేట్ కు వచ్చే వాహనాలను డీకే రోడ్, జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్‌ మీదుగా పంపిస్తారు.
* ఎర్రగడ్డ నుంచి వచ్చే భారీ వాహనాలను ఎడమ వైపుకు మళ్లించి.. 2, 3 చక్రాల వాహనాలను కుడివైపు మళ్లిస్తారు.
* జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్, సోనాబాయ్‌ అలయానికి వెళ్లే రోడ్డు ఇక వన్ వే కానుంది.
* బేగంపేట నుంచి sr నగర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం మీదుగా మళ్లింపు
* అమీర్‌పేట నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్‌ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ameerpet  mythrivanam  traffic diversion  metro rail  hyderabad  traffic police  

Other Articles