చావు బతుకుల మధ్య ఉన్న పాత ఫ్రెండ్ కోసం.. | Rare Gift to Delhi Woman From Old Friend

Man donates liver to save old friend

Puja Bhatnagar, Puja Bhatnagar Story, Delhi Woman Liver Transplantation, Liver Friendship, Chennai Friend Delhi Woman Liver, Friendship Story, Delhi Woman Friendship Story, Facebook Friend, Friendship Special 2017

Puja Bhatnagar perhaps never imagined that friendship would save her life. After suffering chronic liver disease for 17 years, the 44-year-old woman was told by doctors in May that medicines were no longer enough.Only a transplant would save her. The family tried to find a donor among relatives, but found no one suitable. It was then that Prasanna Gopinath stepped up. Finding a plea for help on Bhatnagar's Facebook page, Gopinath flew to Delhi from Chennai, ready to donate a part of his liver to save her life. Crowd-funding help collect the funds and the transplant was carried out on July 21 at Max Hospital in Saket. Doctors said both the donor and recipient are doing well post-surgery.

ఎమోషనల్ స్టోరీ :దోస్త్ మేరా దోస్త్!

Posted: 08/03/2017 10:10 AM IST
Man donates liver to save old friend

నిర్మలమైనది.. స్వచ్చమైనది.. సంపదకు, స్వార్థానికి అతీతం ఎన్ని కొటేషన్లు చెప్పుకున్నా.. ప్రాణానికి ప్రాణం పెట్టే స్నేహాం చిరకాలం నిలుస్తూనే ఉంటుంది. తన ప్రాణాలు కాపాడాలంటూ ఓ మహిళ తన ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ కు వచ్చిన స్పందన ఆమె ముఖంలో నవ్వుల వెలుగును నింపింది. సుమారు పదేళ్ల తర్వాత ఓ స్నేహితుడి ద్వారా అవయవదానం, మరికొందరి సహకారంతో ప్రాణదానం జరగటం విశేషం.

ఢిల్లీకి చెందిన పూజా భట్నాగర్ (44) గత 17 ఏళ్లుగా కాలేయ సమస్యతో బాధపడుతోంది. మందులతో ఇక కష్టమని, కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. దీంతో కుటుంబ సభ్యులు కాలేయ దానం చేసే వారి కోసం బంధువుల్లో ప్రయత్నించారు. అయితే ఎవరి కాలేయమూ ఆమెకు సరిపోలేదు. దీంతో తన ఫేస్ బుక్ ద్వారా భట్నాగర్ అభ్యర్థించింది. దీనిని చెన్నైలో డాగ్ ట్రైనర్ గా ఉన్న గోపీనాథ్ చూశాడు. తన స్నేహితురాలు ఆపదలో ఉందన్న విషయం తెలుసుకుని అవయవదానానికి ముందుకు వచ్చాడు.

2007లో అంటే పదేళ్ల క్రితం వేల్స్‌లోని గ్లామోర్గాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తాను పూజా దంపతులతో కలిసి ఫ్లాట్‌‌ను షేర్ చేసుకున్నాడంట. రెండేళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన గోపీ ఎఫ్ బీ లో వాళ్లతో టచ్ లో ఉంటూ వస్తున్నాడు. ఆమె తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. ఆమె అంతబాధలో ఉందని తెలిసి తానెలా చూస్తూ ఉండగలనని ప్రశ్నించారు. ఒక్కోసారి రక్తసంబంధీకులు అవయవదానానికి వెనకాడుతున్నారు. కానీ, స్నేహం కోసం గోపీ ఇలా ముందుకు రావటం విశేషమని మాక్స్ ఆస్పత్రి వైద్యుడు గుప్తా చెబుతున్నాడు.

అయితే అవయవదానం కు ఏర్పాటు జరిగినప్పటికీ, ఆపరేషన్ కోసం 25 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారంట. కానీ, ఆమె భర్త అనురాగ్ భట్నాగర్ దగ్గర అంత డబ్బు లేకపోవటంతో
గురుగ్రామ్ లోని తన స్నేహితులను ఆశ్రయించాడు. తమ స్నేహితుడు భార్య ఆపదలో ఉన్న విషయం తెలిసిన వాళ్లు తమ వంతు సాయంతోపాటు సోషల్ మీడియా ద్వారా సుమారు 363 మంది దగ్గర నుంచి ఆ డబ్బును సేకరించి డబ్బును అందించారు. జూలై 21న సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడిని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.


పాత బడినా కొద్దీ బాగుండేది ఒక్క స్నేహం మాత్రమేనేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Liver Transplantation  Chennai Man  

Other Articles