ఆ మొగోడి మూలంగానే మొత్తం... | No Use with Assembly Seats increase in Telangana

Cm kcr clarity on assembly seats increase

CM KCR Press Meet, KCR Jairam Ramesh, KCR Lost Hopes Assembly Seats, Telangana Assembly Increase, Telangana Seats, No Use Assembly Seats, KCR Fire Jairam, KCR Mogodu Jairam Ramesh

Telangana CM KCR Fires on Congress Leader Jairam Ramesh Over Assembly Seats. Lost Hopes and No Use with That.

సీట్ల పెంపుతో పెద్దగా లాభం లేదా?

Posted: 08/03/2017 08:19 AM IST
Cm kcr clarity on assembly seats increase

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో ఉండదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తమ వంతు ప్రయత్నాలుగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి పెద్దలకు మొరపెట్టుకుంటూ వస్తున్నారు. అయితే తనకు మాత్రం ఆ అంశంపై ఎలాంటి ఆసక్తి లేదని, అవి పెరిగినా, పెరగకపోయినా ఒకటేనని అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

చిన్నరాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు చట్టం చేసినప్పుడు ఏం చేశారంటే .. కొన్ని సీట్లు పెంచితే సుస్థిరంగా ఉంటుందని భావించారు. ఈ రోజు సీట్ల సంఖ్య పెరగకపోవడానికి ప్రధాన కారణం జైరామ్ రమేశ్ యొక్క అజ్ఞానం. నాడు డ్రాఫ్ట్ రాసింది ఈ మొగోడే అంటూ కాస్త ఘాటుగానే చురకలు అంటించాడు. నాట్ విత్ స్టాండింగ్ 170 కు బదులు ‘విత్ స్టాండింగ్ 170’ అని జైరామ్ పేర్కొనటం వల్లే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కేంద్రం స్పష్టం చేస్తోందని వివరించాడు. ‘మొన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు చెప్పాను.. సీట్ల సంఖ్య పెంచుతామంటే పెంచండి, లేకపోతే లేదు అని. అంతేకానీ, ముసుగులో గుద్దులాట మంచిదికాదు అని కోరాను. దానికి ఆయన ఇచ్చిన బదులును బట్టి సీట్ల సంఖ్య పెంచడం లేదని నాకు అర్థమైంది అని కేసీఆర్ వెల్లడించాడు.

 

మరోపక్క పోలీసు శాఖ వాహనాలు కొనుగోలుకు సంబంధించి అక్రమాలు అంటూ జైరామ్ చేసిన వ్యాఖ్యలపైనా కేసీఆర్ స్పందించాడు. ఏం తెలియకుండా జైరాం రమేష్ మాట్లాడుతున్నారని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపని పక్షంలో ఆయన ముక్కునేలకు రాయాలని అన్నారు. ఆ పార్టీ వాళ్లు(కాంగ్రెస్) చేసిన తప్పులు తాము కూడా చేస్తామని ఆయన అనుకుంటున్నారేమో అంటూ సెటైర్ వేశాడు. జైరామ్ రమేశ్! కనీసం సర్పంచ్ గానైనా ఎప్పుడైనా పోటీ చేసి గెలిచారా?, ‘రాజ్యసభ బగ్’ అంటూ ఆయనపై కేసీఆర్ మండిపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  Jairam Ramesh  Assembly Seats  

Other Articles