ఆ గాంధీ చెప్పాడు.. ఈ గాంధీ చేస్తున్నాడు | Rahul Gandhi Doing What Gandhi Desired

Rahul responsible for dissolving congress

BJP Chief, Amit Shah, Rahul Gandhi, Congress Destroy, Congress Dissolve Rahul, Rahul Gandhi Mahatma Gandhi, Mahatma Gandhi Congress Dissolve, Mahatma Gandhi Desire Rahul Fulfill

Bharatiya Janata Party (BJP) President Amit Shah Jibe at Rahul Gandhi. Addressing a gathering in Rohtak, Shah said, "Gandhi ji ne kaha tha azadi ke turant baad Congress ko bikhar jana dena chahiye... khair wo Gandhi ne nhi kiya ab koi Gandhi kar rha h". (Mahatma Gandhi had said that Congress should be disbanded after Independence. While that Gandhi couldn't do it, some other Gandhi is doing it now.)

కాంగ్రెస్ సర్వనాశనం రాహుల్ తోనే...

Posted: 08/03/2017 08:40 AM IST
Rahul responsible for dissolving congress

సోనియా గాంధీ అనారోగ్యంతో సీన్ లోకి వచ్చిన రాహుల్ గాంధీ పార్టీ విస్తరణ మాట మాట అటుంచి.. ఒక్కో రాష్ట్రాల నుంచి పార్టీని ఎగ్జిట్ చేస్తూ వస్తున్నాడంటూ పలువురు సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ వస్తున్నారు. రోహతక్ లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన రాహుల్ పై వ్యంగ్య వ్యాఖ్యలే చేశాడు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసేయాలని మహాత్మాగాంధీ కోరారు. కానీ, అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ ఆ పని చేయలేకపోయింది. కానీ, ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ చేస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని, దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని జోస్యం చెప్పాడు.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా అభివృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని అన్నారు. మళ్లీ ఈ ప్రాంతం (హరియాణా)లో బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. కొడుకు మీద ప్రేమతో సోనియా పార్టీని ముంచేస్తుందంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress Dissolve  Amit Shah  

Other Articles

Today on Telugu Wishesh