kuntia is now telangana congress incharge తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా కుంతియా..? దిగ్విజయ్ తొలగింపు

Kuntia is now telangana congress incharge replaced by digvijay singh

digvijay singh, AICC general secretary, satish, ktr, kcr, telangana, congress, kuntia, aicc secretary, congress affairs incharge, rahul gandhi, sonia gandhi

congress senior leader and fomer Chief Minister Digvijay Singh removed from Telangana Congress incharge and replaced by kuntia on Tuesday.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా కుంతియా..? దిగ్విజయ్ తొలగింపు

Posted: 08/01/2017 01:28 PM IST
Kuntia is now telangana congress incharge replaced by digvijay singh

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను తొలగించింది ఆ పార్టీ అధిష్టానం. దిగ్విజయ్ స్థానంలో కుంతియాకు పూర్తి భాధ్యతలను అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరో రెండేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఇప్పటి నుంచే తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు వేస్తున్న ప్రణాళికల్లో భాగంగా దిగ్విజయ్ స్థానంలో కుంతియాను నియమించింది. ఇక కాంగ్రెస్ నేత సతీష్ కు ఏఐసీసీ కార్యదర్శగా బాధ్యతలను అప్పగించింది.

ఇటీవల జరిగి గోవా రాష్ట్ర ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మరోక ఎమ్మెల్యేను తమకు మద్దతు ప్రకటించేలా చేసుకోవడంలో విఫలమైన కారణంగా దిగ్విజయ్ సింగ్ ను పక్కనబెట్టారని వార్తలు అందుతున్నాయి. అయితే గత ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతికూల ఓట్లు నమోదైన క్రమంలో కాంగ్రెస్.. రానున్న ఎన్నికలలో ఎలాగైన విజయబావుటాను ఎగురవేయాలని భావిస్తుంది. ఇక దిగ్విజయ్ సింగ్ వయోభారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధిష్టానం అతడ్ని తప్పించి కుంతియాకు బాధ్యతలను అప్పగించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఇదిలావుండగా, ఇటీవల ఆయన తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులుపై కొన్ని ఘాటైన విమర్శలు కూడా ఆయనను తొలగించడానికి కారణమయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పోలీసులపై, డ్రగ్స్ వ్యవహారంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత డ్రగ్ కేసుపై ట్వీట్ చేస్తూ తెరాస నేతల హస్తం ఉందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digvijay singh  ktr  kcr  telangana  congress  kuntia  congress affairs incharge  

Other Articles