Homosexual nabbed for sexual abuse మగాళ్లూ జాగ్రత్తా..! మైసూరులో స్వలింగ అత్యాచార కేసు..

Homosexual nabbed for sexual abuse

Homosexual nabbed for sexual abuse, Mani, green Fodder, cattle, isolated place, sexual assault, rachappa, Homosexual, nabbed, sexual abuse, HD kote, karnataka, crime

Police nabbed a 28-year-old man Mani homosexual in a sexual assault case, as victim Rachappaji lodged a complaint accusing the latter of luring him on the pretext of providing green fodder to the cattle and later sexually assaulting him in an isolated location.

మగాళ్లూ జాగ్రత్తా..! మైసూరులో స్వలింగ అత్యాచార కేసు..

Posted: 08/01/2017 12:31 PM IST
Homosexual nabbed for sexual abuse

ఓ వైపు దేశవ్యాప్తంగా అడపడచులపై అఘాయిత్యాలు పెరుగుకుపోతున్న క్రమంలో ఇక మగవాళ్లకు కూడా అ వ్యధ అనుభవించాల్సిన రోజులు వచ్చాయా..? అన్న రీతిలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో జరిగిన ఘటన ప్రశ్నిస్తున్నట్లు వుంది. ఇప్పటికే స్వలింగ సంపర్కం సమాజంపై ప్రభావాన్ని చూపుతున్న క్రమంలో స్వలింగ సంపర్క అత్యాచార ఘటన నమోదైంది. చెడుమార్గంలో, చెడు సావాసాలకు లోనైన యువకుడు.. మరో యువకునిపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనం కలిగిస్తోంది.

హెచ్‌.డీ.కోట తాలూకాలోని చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. అయితే వివరాల్లోకి వెళ్తే.. నంజనయ్య కాలనీకి చెందిన మణి అనే యువకుడు.. చెడు సావాసాలకు, వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడిని కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి ఐదు రోజుల క్రితం వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఓ వైపు లైంగిక దాడి జరిగినా.. భయంతో నిజాన్ని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి రాచప్పది.

కాగా, భయంతో పాటు లైంగిక దాడి జరగడంతో కుమిలిపోయిన రాచప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను చేయించగా.. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రాచప్పపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో మగాడైన తమ బిడ్డపై కూడా లైంగిక దాడి చేయడమేంటని రోదించిన తల్లిదండ్రులు.. విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual assault  rachappa  Homosexual  nabbed  sexual abuse  HD kote  karnataka  crime  

Other Articles

Today on Telugu Wishesh