Penalty Points System in Hyderabad Traffic Starts

Hyderabad traffic penalty points system starts

Hyderabad, Hyderabad New Traffic Rules, New Points System Hyderabad, Hyderabad Traffic Rules, Traffic 12 Points System, 12 Points System Traffic, Traffic New Rules, Driving License Points System, Hyderabad Traffic Points System Details, August 1st Hyderabad Traffic Rules

Traffic 12 Points System Implemented Now in Hyderabad. New Points System to Cancel Driving Licenses.

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్

Posted: 08/01/2017 08:29 AM IST
Hyderabad traffic penalty points system starts

సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తో హైదరాబాద్ లో వాహనదారులకు నేటి నుంచి చుక్కలు చూపించబోతుంది ట్రాఫిక్ శాఖ. ఉల్లంఘనను బట్టి పాయింట్ల విధానంలో కోతవేయనున్నారు. 12 పాయింట్లు దాటితే అతిక్రమించిన వాళ్ల లైసెన్స్ రద్దు చేయనున్నారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రంలోనే ఈ రూల్స్ తేవటం విశేషం. లైసెన్స్ దాటాక కూడా మళ్లీ వాహనం నడిపితే మాత్రం జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయిన అధికారులు పూర్తి స్థాయిలో నేటి నుంచి అంటే ఆగష్టు 1 నుంచి అమలు చేయనున్నారు.మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు నడిపితే 5 పాయంట్లు, 

దోపిడీలు, స్నాచింగ్ లకు వాహనాలు వినియోగిస్తే 5 పాయింట్లు,
వాహనాలు నడుపుతూ వ్యక్తుల మరణానికి కారణమైతే 5,
మద్యం తాగి కార్లు, భారీ వాహనాలు నడిపితే 4 పాయింట్లు,
తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు,

అలాగే 40 కిలోమీటర్ల వేగాన్ని మించితే 3 పాయింట్లు విధించనున్నారురేసింగ్ లో పాల్గొన్నా, మితిమీరిన వేగంతో వెళ్తున్నా 3 పాయింట్లు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే 2 పాయింట్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు, వాయు, శబ్దకాలుష్యం వెదజల్లే వాహనాలకు 2 పాయింట్లు, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు విధిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయాలపాలైతే రెండు పాయింట్లు విధించనున్నారు. ఆటోడ్రైవర్లు తమ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే ఒక పాయింట్ విధిస్తారు. సీట్ బెల్టు లేదా హెల్మెట్ పెట్టుకోని పక్షంలో కూడా ఒక పాయింట్ విధిస్తారు. ఇలా మొత్తం 12 పాయింట్లు అయ్యే దాకా చూసి ఆపై వాళ్ల లైసెన్స్ ను రద్దు చేసి పడేస్తారు. సో.. తస్మాత్ జాగ్రత్త!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Points System  Traffic Rules  

Other Articles