Modi Government Wants to End Gas Subsidy

Govt wants to end lpg subsidy by march

LPG Price Hike, LPG Subsidy, Modi LPG Price, LPG India Subsidy, Gas Cylinder Rate Hike, LPG Cylinder Subsidies, PAN Aadhar Dead Link Line

The government ordered state-run oil companies to raise subsidised cooking gas (LPG) prices by Rs 4 per cylinder every month and to eliminate all the subsidies by March next year, Oil Minister Dharmendra Pradhan said.Deadline for Aadhaar-PAN linking extended till August 31

సబ్సిడీ కట్.. కేంద్రం షాకుల మీద షాకులు

Posted: 08/01/2017 08:01 AM IST
Govt wants to end lpg subsidy by march

కేంద్ర ప్రభుత్వం మరో భారాన్ని సామాన్యుడిపై వేసేందుకు సిద్ధమైపోతుంది. గ్యాస్ పై సబ్సిడీ భారాన్ని దించుకునే యత్నమే కాదు, ధర కూడా పెంచాలని ఈ నిర్ణయించుకుంది. ప్రతినెలా గ్యాస్ సిలెండర్ పై నాలుగు రూపాయల ధర పెంచాలని ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే మార్చి నాటికి వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్వయంగా వెల్లడించారు. ఇంతకు ముందు ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియనం ఆధ్వర్యంలోని గ్యాస్ ఏజెన్సీలకు రెండు రూపాయల చొప్పున పెంచాలని ఆదేశించిన కేంద్రం ఇప్పుడు దానిని రెట్టింపు చేయటం గమనార్హం.

ప్రతీ ఇంటికి సబ్సిడీ పేరు మీద ఏడాదికి 12 సిలిండర్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. పరిధి దాటితే మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేయాల్సిందే. ఇంతవరకు సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోండి అని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసేందుకు నడుం బిగించారు.

 

ఆధార్ తో లింకు.. పాన్ చెల్లదు

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గ‌డువును ఆగ‌స్టు 31 వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడిగించింది. ఈలోగా లింక్ చేయ‌క‌పోతే పాన్ కార్డు ర‌ద్ద‌వుతుంద‌ని రెవిన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ ఆదియా తెలిపారు. అలాగే ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌డానికి సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ఆధార్‌, పాన్ లింక్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ కార‌ణంతోనే ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుల తేదీని కూడా ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు పొడిగిస్తూ ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌పై ప‌డుతున్న భారాన్ని త‌గ్గించడానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. జూలై 1 నుంచి ఆధార్‌, పాన్ కార్డుల లింక్‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ చేయ‌క‌పోతే పాన్ కార్డ్ ర‌ద్ద‌వుతుంద‌ని వెల్ల‌డించ‌డం ఇదే మొద‌టిసారి. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా పాన్‌కార్డును ఆధార్ నెంబ‌ర్‌తో లింక్ చేయాల‌ని ఆదాయ‌పు పన్ను శాఖ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG  Modi Government  Price Hike No Subsidy  

Other Articles