actor Manoj Goyal's wife hangs herself in Kandivali flat బాలీవుడ్ నటుడింట్లో విషాదం.. భార్య ఆత్మహత్య..

Actor manoj goyal s wife hangs herself in kandivali flat

manoj goyal, neelima goyal, sucide, financial problems, sony sab tv, tv artist, bollwood actor, mumbai, entertainment, crime

Sajan Re Jhoot Mat Bolo actor Manoj Goyal's wife Neelima Manoj Goyal committed suicide on Saturday by hanging herself from her bedroom's ceiling fan.

బాలీవుడ్ నటుడింట్లో విషాదం.. భార్య ఆత్మహత్య..

Posted: 07/31/2017 03:13 PM IST
Actor manoj goyal s wife hangs herself in kandivali flat

బాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ అర్టిస్టుగా పేరుతెచ్చుకుని ఇటీవలి కాలంలో సోని సబ్ టీవీలో పలు సిరరీయళ్లలో నటుడిగా స్థిరపడిన మనోజ్‌ గోయల్ ఇంట్లో విషాదం అలుముకుంది. అతని భార్య నీలిమా గోయల్‌ బెడ్ రూం గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తన భర్తతో తరచు గొడవలు పడుతున్న నేపథ్యంలో పెరిగిపోయిన అసహనం నేపథ్యంలో ఆమె ఈ తీవ్రనిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ముంబైలోని కండివలి ప్రాంతంలోగల తన నివాసంలో అమె ఫ్యాన్ కు ఉరివేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.

సాజన్ రే జూట్ మత్ బోలో చిత్రంలో నటించిన పేరు తెచ్చుకున్న మనోజ్ గోయల్.. సోనీ సబ్‌ టీవీ నటుడిగా పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు. అంతకుముందు బంటీ ఔర్ బబ్లీ, బ్లాక్‌, కంపెనీ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ప్రస్తుతం తనకు నటుడిగా అదరణ కరువవ్వడంతో ఆయన కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ అర్థిక ఇబ్బందుల కారణంగా గొడవలు ఏర్పడ్డాయని.. వీటివల్ల తీవ్ర మనోవేదనకు గురైన నీలిమా అత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన మనోజ్..  భార్య నీలిమా ఉరేసుకొని ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే వీరి ఎనిమిదేళ్ల కూతురు ట్యూషన్ కు వెళ్లిన సమయంలో అమె ఈ దారుణానికి పాల్పడివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనాస్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యలతో తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, తాను సినిమా, టీవీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోవడంతో తమ మధ్య విభేదాలు వచ్చాయని మనోజ్ అన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles