Guindy park gets rare white cobra అరుదైన శ్వేత నాగు దర్శనం.. భక్తుల పూజలు

Guindy park gets rare white cobra

rare cobra, white cobra in guindy, white cobra in guindy childrens park, white cobra in tiruvallur, devotees pooja to rare white snake, guindy, rare snakes, guindy childrens park, snake, animals, white cobra, tiruvallur, vulnerable animals, snake friends

The Guindy Children’s Park has a new attraction. It is now home to a white cobra, which was accidentally caught by snake catchers in Tiruvallur

నాగుల పంచమి రోజున అరుదైన శ్వేత నాగు దర్శనం.. భక్తుల పూజలు

Posted: 07/29/2017 03:16 PM IST
Guindy park gets rare white cobra

భక్తుల మూఢ విశ్వాసంలోని పరమార్థాన్ని గ్రహించాలే తప్ప.. వారిని నిందిస్తూ విమర్శలు చేయడం మాత్రం సమంజసం కాదని కొందరు సూచిస్తుంటారు. ఇలాంటి అరుదైన విషయమే తమిళనాడు జిల్లాలోని తిరువల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. హిందువులు నాగదేవతలకు పూజలు జరిప పవిత్రమైన నాగుల పంచమి రోజున ఓ ఆ జిల్లాకేంద్రంలోని గిండి పిల్లల పార్కు మాత్రం హిందు భక్తులతో జనసంద్రంగా మారింది. అందుకు కారణం అక్కడ అరుదైన శ్వేతనాగు వుండటమే. అదేంటి చిల్డ్రన్ పార్కులో శ్వత నాగేంటి..? అనుకుంటున్నారా.?

తిరువళ్లూరు జిల్లా పూండి అటవీ ప్రాంతంలో కనిపించిన శ్వత నాగును అటవీ సిబ్బంది చిల్డ్రన్స్‌ పార్కుకు తరలించారు. ఈ వార్త దవానంలా ఆ పరిసర ప్రాంతాలవారికి చేరింది. అంతే నాగుల పంచమి రోజుల తమ పూజలందుకునేందుకే ఈ శ్వేత నాగు వచ్చిందని మహిళా భక్తులు పామును దర్శించుకుని పూజలు చేశారు. ఇక శ్వేత నాగు అనగానే చూడటానికి ఎలా వుంటుందన్న అసక్తితో సందర్శకులు ఉత్సాహం చూపారు.

పూర్తిగా తెల్లగా ఉన్న ఈ పామును శ్వేతనాగు అంటారని పార్కు నిర్వాహకులు తెలిపారు. సాధరణంగా శ్వేతనాగుల కళ్లు ఎర్రగా ఉంటాయని, అయితే ఈ సర్పం కళ్లు నలుపు రంగులో ఉన్నాయని చెప్పారు. శ్రీలంక, రాజస్థాన్ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే తెల్లనాగు, పూండి అటవీ ప్రాంతాంలో దర్శనమివ్వడంతో ప్రజలు పామును చూడటానికి బారులు తీరారు. పలువురు భక్తులు పూజలు కూడా చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cobras  white cobra  guindy  rare snakes  childrens park  guindy  tiruvallur  

Other Articles