'Wish You Were Our PM', Pak Woman Tweets Sushmaji పాకిస్థాన్ ప్రధానిగా సుష్మా స్వరాజ్ కావాలట

Sushma swaraj takes dig at sartaj aziz pakistani woman joins in

sushma gets compliment from pak women, pak woman hijaab asif tweets, External affairs minister Sushma Swaraj, hijaab asif, sushma swaraj, Sartaj Aziz, PoK, Medical visa, Kulbhushan Jadhav, india, pakistan

Hijaab Asif, a pakistani national wished Indian External affairs minister Sushma Swaraj could be Pakistan's prime minister and asked if she can call the minister "superwoman".

సుష్మా స్వరాజ్ కు పాకిస్థాన్ నుంచి బంఫర్ ఆఫర్..

Posted: 07/28/2017 12:42 PM IST
Sushma swaraj takes dig at sartaj aziz pakistani woman joins in

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పదవీ గండం వెంటాడుతుంది. పనామా పేపర్ల ద్వారా వెలుగులోకి వచచిన ఆయన కుంభకోణాల కేసులకు సంబంధించి అ దేశ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది. అయితే ఈ క్రమంలో భారత్ విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కు పాకిస్తాన్ నుంచి బంఫర్ అఫర్ వచ్చింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ జర్నల్ సుష్మా స్వరాజ్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఓ పెద్ద వ్యాసాన్ని రాయగా, పాకిస్థాన్ కు చెందిన మహిళ మాత్రం సుష్మా స్వరాజ్ అంకితభావాన్ని, అదుకునే తత్వాన్ని చూసి.. ఓ తీరని కోరిక కోరింది.

భారత్‌లో వైద్యం కోసం దరఖాస్తు పెట్టుకున్నవారికి.. తాజాగా తీసుకువచ్చిన పాకిస్థాన్ చట్టాల ప్రకారం.. అ దేశానికి చెందిన విదేశాంగశాఖ తప్పక వారి ధరఖాస్తును ఎండార్స్ చేస్తూ ఓ లేఖను భారత విదేశాంగ శాఖకు పంపిస్తుంది. కానీ గత కొంత కాలంగా అ లేఖ కోసం వేచిచూసి.. కళ్లు కాయలు కాచేలా నిరీక్షించినా.. పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళకు ఆ లేఖ అందనే లేదు,. దీంతో అమె నేరుగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా అర్జీ పెట్టుకున్నారు. అమెకు వెంటనే అనుమతినిచ్చిన సుష్మా స్వరాజ్ వారికి వీసా లభించేలా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ కు అదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చట్టాలు మార్చనంత మాత్రాన లాభం లేదని.. వాటిని సరైన సమయంలో వినియోగించుకుంటేనే మంచిదని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ బంధువు లేఖను ఎండార్స్ చేయడానికి కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు తీరిక లేదా.? అని పాకిస్థాన్ విదేశాంగ శాఖపై ఫైరయ్యారు. సుష్మా మెడికల్ వీసాకు అంగీకారం చెప్పడంతో అమెకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో హిజాబ్ అసీఫ్ అనే మహిళ.. తమ దేశ విదేశాంగశాఖను తీవ్రంగా తూలనాడింది. తమ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారా..? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పింది. ఇక తాము భారతీయులను ద్వేషిస్తామన్న వార్తలను కూడా హిజాబ్ అసిఫ్ ఖండించింది. ఈ సందర్భంగా అమె సుష్మా స్వరాజ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇంత తొందరగా సుష్మా స్పందిస్తారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. సుష్మా మా దేశానికి(పాకిస్తాన్‌) ప్రధానమంత్రి అయితే బాగుండేదని వ్యాఖ్యానించారు. మా దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చేవారు.' అని పోస్టు చేశారు. అంతకుముందు చేసిన ట్విట్ లో 'మిమ్మల్ని ఏమని పిలవాలి?. సూపర్‌ విమెన్‌ అనా?. దేవత అనా?. మీ ఉదార స్వభావం గురించి ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. లవ్‌ యూ మేమ్‌. మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను.'  అని పేర్కోనింది ఆసిఫ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hijaab asif  sushma swaraj  Sartaj Aziz  PoK  Medical visa  Kulbhushan Jadhav  india  pakistan  

Other Articles