'People Will Do Anything For Selfish Gains' దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

Rahul calls it betrayal of anti communal mandate

rahul gandhi on nitish, rahul gandhi slams nitish, rahul gandhi fires on nitish, rahul on mahagatbandhan, Nitish kumar, Rahul Gandhi, janata dal united, Congress, Mahagathbandhan, Bihar, Chief Minister, lalu prasad yadav, cheating, politics

Bihar Chief Minister Nitish Kumar's decision to partner with BJP, Rahul Gandhi said: "We knew this planning was going on for three-four months. In politics you get to know what's in a person's mind. I was aware of the conspiracy."

దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

Posted: 07/27/2017 11:37 AM IST
Rahul calls it betrayal of anti communal mandate

బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి పంచన చేరడం దారుణమని అన్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనన్నారు. నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను, మహాకూటమిని మోసం చేశారని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ఏం లాభాన్ని అశించి బీజేపితో జతకట్టారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం మార్పిడి కోసం నితీష్, బీజేపితో కలసి గత మూడు నాలుగు నెలలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారన్న విషయం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు.
 
బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు నితీశ్ ప్రమాణం చేసిన వెంటనే రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..నితీశ్ కుమార్ మోసానికి మరుపేరుగా నిలిచారని మండిపడ్డారు. ఇలా చేస్తున్నారన్న విషయాలు తెలిపిన వెంటనే ఢిల్లీకి వచ్చిన ఆయనతో తాను సమావేశమయ్యానని చెప్పారు. అయితే నితీశ్ తనతో సమావేశం అయినప్పుడు ఆయన స్పందన వేరేగా ఉందని కానీ ఇప్పుడు ఆయన అనూహ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమెంచ్చిందని ప్రశ్నించారు.

మతోన్మాద శక్తులు అధికారంలోకి రాకుండా, అందుకు వ్యతిరేకంగా నిలబడేందుకు బీహార్ ప్రజలు ఆయనకు సీఎం పదవిని కట్టబెడితే ఆయన వారిపంచన చేరడాన్ని ప్రజలు ఎలా సమర్థిస్తారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆయన తన పయనాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు కేవలం అధికారం కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లడం ఆక్షేపనీయం కాదా..? ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ కాదా..? అని రాహుల్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish kumar  Rahul Gandhi  janata dal united  Congress  lalu prasad yadav  Bihar  politics  

Other Articles