కరెంట్ కోతపై అడిగితే బాబు ఎలా బెదిరించాడో చూడండి | Andhra CM Threatens Public at Rally

Chandrababu naidu threatens public at rally

Andhra CM Threat Public, Chandrababu Naidu Angry on Public, Chandrababu Naidu Nandyala Rally, Chandrababu Naidu Threatens Public at Rally, CBN Threat People, Chandrababu Drunk Man, Chandrababu Threat Video, CM Threat Man, Chandrababu Warn Man, Chandrababu Warn in National Media, How Dare You Question Me Chandrababu

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu got angry at a man and threatened to take action against him at Nandyala Bypoll Rally. ‘You may be booked or branded a 'drunk' if you ask questions to Andhra CM.

ITEMVIDEOS:బాబు బెదిరింపు.. హైలెట్ అవుతోంది

Posted: 07/26/2017 08:41 AM IST
Chandrababu naidu threatens public at rally

టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోపంతో మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఓ బహిరంగ సభలో సమస్యలపై గళం ఎత్తిన ఓ వ్యక్తిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో నేషనల్ మీడియా కూడా బాబు తీరును ఏకీపడేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో మంగళవారం ఓ బహిరంగసభను టీడీపీ నిర్వహించింది. దీనికి చంద్రబాబు హాజరయి ప్రసంగించాడు. ఆ సమయంలో .. తన ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని, ఎక్కడా కరెంట్ కోతలు లేకుండా చూస్తున్నామని చెబుతున్నాడు. ఇంతలో జిల్లాలోని గోస్పాడు మండల ప్రజలు కరెంట్ కోతలపై నిరసన గళం ఎత్తాడు.

 

అది విన్న బాబుకు తలకొట్టేసినట్లయ్యింది. అంతే ఆగ్రహాంతో ఊగిపోతూ... ప్రశ్నించిన వారిలో ఉన్న ఓ సామాన్యుడిపై నిప్పులు చెరిగారు. తన శైలి ఆంగ్ల భాషలో దారుణంగా హెచ్చరించాడు. ‘‘కరెంట్ లేదంటూ నాకే ఫిర్యాదు చేస్తావా? కళ్లు లేవా.. కనిపించటం లేదా..?. నువ్వు ఏ పార్టీ వాడివి..? వైఎస్సార్ సీపీకి చెందిన వాడివా.. నిన్ను ఎవరు పంపారు.. తాగావా..? అంటూ మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా.. నేను ముఖ్యమంత్రిని.. ప్రజల ముందు నన్ను ప్రశ్నిస్తావా.. నువ్వు చెప్పిన ప్రాంతానికి కలెక్టర్‌ను పంపిస్తా, నువ్వు చెప్పింది తప్పని తేలితే, నీపై కేసు బుక్ చేయిస్తా..? అంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chandrababu Naidu  Nandyala Rally  Threat Man  

Other Articles