డీడీ లోగోను మార్చేస్తారంట.. | DD decides to change Its Iconic Logo

Dd launches new logo contest

Doordarshan, Doordarshan Logo, Doordarshan Logo Contest, Doordarshan Iconic Logo, Doordarshan Channel Network, DD Network Contestant, Do not Change DD Icon, DD Logo, DD Iconic Logo

Doordarshan Wants To Change Its Logo To Something More 'Youthful'. Invites public entries for new logo with 1 Lakh Cash Prize.

అందరినీ టార్గెట్ చేస్తూ.. లక్ష ప్రైజ్ మనీ!

Posted: 07/26/2017 08:16 AM IST
Dd launches new logo contest

23 ఛానెళ్లు.. ఒక్క నెట్ వర్క్.. ప్రభుత్వ రంగ టెలివిజన్ దూరదర్శన్ దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు. మంచి మధుర స్మృతులను మిగిల్చిన డీడీ ఛానెల్ కొన్నేళ్ల నుంచి ఛానెళ్ల పోటీ ప్రపంచంలో దారుణంగా వెనుకబడిపోయింది. అందుకే కొత్త దనం సంతరించుకుని మళ్లీ మన ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే తన నెట్ వర్క్ లోగోనే మార్చాలని నిర్ణయించింది.

సరికొత్త డిజైన్ కోరుతూ ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. ది బెస్ట్ ను అందించిన వారికి లక్ష రూపాయల నజరానా ప్రకటించింది. లోగో చూడగానే చానల్‌కు కొత్తదనం కనిపించేలా ఉండాలని ఓ ప్రకటనలో పేర్కొంది. గతంతో పొలిస్తే ఇప్పుడున్న యువత వారు దూరదర్శన్‌వైపు అంతగా ఆసక్తి చూపడం లేదని ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశి శేఖర్ వెంపటి పేర్కొన్నారు. ముఖ్యంగా 35 ఏళ్ల పైబడిన వారు అయితే ఛానెళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేలా, ఇప్పటి ట్రెండ కు తగ్గట్లుగా ఉండాలని ఆహ్వానం అందించాడు.

1959 సెప్టెంబర్ 15న సత్యం, శివం, సుందరం అనే అక్షరాల లోగోతో ప్రారంభమైన దూరదర్శన్ తోపాటు ఆల్ ఇండియా రేడియో కూడా ప్రసార భారతి నేతృత్వంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, లోగో డిజైన్ పంపేందుకు ఆగష్టు 13 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక దీనిపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మా బాల్యానికి చిహ్నాం దయ చేసి మార్చకండి... బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా విజ్నప్తి చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doordarshan  Logo Contest  Cash Prize  

Other Articles