రైల్వే తిండి తింటున్నారా? అయితే ఇది మీకోసమే... | Railways Serving Food Unfit for Humans

Shocking facts behind indian railway food

Comptroller and Auditor General, Railway Food Not Safe, CAG Railway Catering, Railway Catering Food,IRCTC Food, Indian Railway Food, Railway Food Scam, Indian Train Food

Comptroller and Auditor General (CAG) blames govt policy for poor train food, low hygiene. CAG audit report Submit their report in Parliament on July 21st.

యాక్... ఆ తిండి ఎవడైనా తింటాడా?

Posted: 07/21/2017 08:57 AM IST
Shocking facts behind indian railway food

ధరలు మండిపోతున్నఈ రోజుల్లో కడుపునిండా తిండి తినడమే గగనమనుకుంటే.. మధ్యలో కల్తీ అనేది ఒకటి వచ్చి చేరటంతో జనాల ఒళ్లు, జేబు గుల్లయిపోతున్నాయి. అయితే వందలు, వేలు పోసి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్ఛితంగా నాణ్యమైన ఫుడ్ నే ఆశిస్తాం. దాని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే రంగంలో అందించే ఆహారం వెనుక ఉన్న కథ తెలిస్తే మాత్రం మీరు విస్తూపోవటం ఖాయం.

రైల్వే క్యాటరింగ్ సేవలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ రిపోర్టులో షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. రైళ్లలో అందిస్తున్న ఆహారం అసలు మనిషనేవాడు తినలేడని చెబుతోంది. ఈమేరకు 80 రైళ్లు, 70 స్టేషన్లలో సోదాలు నిర్వహించిన కాగ్ బృందం ఓ నివేదికను తయారు చేసింది. కలుషిత ఆహారం, రీసైకిల్ చేసిన ఆహార పదార్థాలు, జీవితకాలం చెల్లిన సీసాలు, ప్యాక్‌లలో ఆహారం అందిస్తున్నట్టు వివరించింది. అలాగే గుర్తింపు లేని బ్రాండ్ల వాటర్ బాటిళ్లను స్టేషన్లలో విక్రయిస్తున్నట్టు తెలిపింది.

ఆహార పదార్థాలపై మూతలు ఉండడం లేదు. ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు తదితరాలు వాటి పైనుంచే తిరుగుతున్నాయి. తాము నిర్వహించిన తనిఖీల్లో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించలేదు అని కాగ్ పేర్కొంది. పైగా ఆర్డర్ చేసిన ఆహారానికి బిల్లులు కూడా ఇవ్వడం లేదని వివరించింది. ఇది అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చే వాళ్లకే కాదు.. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ల విషయంలోనూ జరుగుతోందంట. స్టేషన్లలో కూడా అపరిశుభ్రమైన నీళ్లు సరఫరా అవుతున్నాయని, చెత్త డబ్బాలపై మూతలు పెట్టడం లేదని పేర్కొంది.

కేటరింగ్ విధానంలో తరచూ మారుతున్న విధానాల్లోనే తప్పు ఉన్నట్టు ఆడిట్ గుర్తించింది. విధానాలు తరచూ మారుతుండడం వల్ల సేవల్లో అనిశ్చితి నెలకొన్నట్టు తేల్చింది. ఈ నివేదిక నేడు (శుక్రవారం) పార్లమెంటులో కాగ్ ప్రవేశపెట్టబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  CAG Audit Report  Poor Food  

Other Articles