monkey makes trains halt in guntur కొతి చేష్టలంటే తెలుసా..? ఇలాగే వుంటాయా..?

Macaques menace makes trains halt in guntur

monkey, tadepalli gudem, electric sub station, railway officials, guntur, repairs, vijayawada, krishna cannal junction, fuse fail, trains halted in guntur, monkey made trains halt in guntur, monkey dead in short circuit

monkey which played with electric wires at guntur tadepalli gudem dead, as a wire which cut and fell on track, resulting halt of trains in guntur

రైళ్లను నిలిపేసిన మర్కట మారాజు.. చివరకు..

Posted: 07/20/2017 01:07 PM IST
Macaques menace makes trains halt in guntur

పిల్లలు ఏదైనా తప్పు చేసినా.. కేవలం కాలయాపన కోసం పనులు చేసినా వాటితో జరిగే అనర్థాలు మాత్రం చాలా వుంటాయి. అయితే ఈ పనులతో వారికి ఫైసా లాభం లేకపోయినా.. అవతలివారికి మాత్రం నష్టం సంభవించక తప్పదు. ఇలాంటి పనులు చేసినప్పుడు పెద్దలు ఒరేయ్ కొతి చేష్టలు చేశావో.. తాట తీస్తా అని హెచ్చరిస్తుంటారు. అసలు కోతి చేష్టలంటే.. ఏమిటీ.. కావాలని కాకుండా సరదాగా చేసిన పనులకు కూడా తిట్టేస్తారా.. అంటూ పిల్లలు మనోవేధనకు గురవుతుంటారు.

అయితే ఇవి నిజంగా కొతి చేష్టలే అని పెద్దలు కసురుకుంటారు. నిజంగా కొతులు చేసే చేష్టలు ఇలాగే వుంటాయని మరో మర్కట మారాజు నిరూపించాడు. అదెలా అంటారా...? తాను సరదాగా ఓ విద్యుత్ తీగతో అడుకుని దానిని తెంచేవరకు ఊగాడు. ఇక అది తెగంగానే తన దారిన తాను వెళ్లాడు. అయితే దీంతో గుంటూరు జిల్లా రైల్వే అధికారులకు పెద్ద సమస్యే తలెత్తింది. విద్యుత్ తీగ తెగిన మార్గంలో ఎక్కడి రైళ్లను అక్కడి నిలిపేసి వేగంగా మరమ్మతు పనులు చేపట్టాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం రైల్వే గేటు వద్ద ఓ కోతి విద్యుత్ స్తంభం ఎక్కి గంతులు వేయడంతో, ఓ తీగ తెగి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నడికుడి - విజయవాడ లైన్ లో విజయవాడకు ముందు వచ్చే కృష్టా కెనాల్ జంక్షన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఫ్యూజ్ పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు గేటు వద్ద విద్యుత్ తీగలు తెగాయని, మరమ్మతులు చేపట్టారు. ఈ లోగా కేరళ ఎక్స్ ప్రెస్ ను పెదవడ్లపూడిలో, బిట్రగుంట ప్యాసింజర్ రైలును దుగ్గిరాలలో నిలిపివేశారు. మిగతా రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తయిన తరువాత రైళ్ల రాకపోకలకు యధావిధిగా కొనసాగించారు. అయితే ఇక్కడ మాత్రం విద్యుత్ తీగతో అడిన కోతి విద్యుధ్ఘాతానికి గురై మరణచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles