YCP Mla Roja yet to get another notice from Assembly ఫ్రైర్ బ్రాండ్ కు మరోమారు నోటీసులు..

Ycp mla roja yet to get another notice from assembly

notices, presidential polls, MLA RK Roja, YSRCP, AP Assembly speaker, Kodela Shiva Prasad, andhra pradesh, TDP government

As YCP fire brand and nagari Mla Roja questions speaker impartiality in the amaravati assembly premises during presidential polls, she is yet to get another notice from Assembly

ఫ్రైర్ బ్రాండ్ కు మరోమారు నోటీసులు..

Posted: 07/17/2017 09:26 PM IST
Ycp mla roja yet to get another notice from assembly

వైసీపీ ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ ఫిక్స్ అయ్యిందా,? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏ చిన్న విషయంలో అమె దొరికినా వెంటనే అమెపై నోటీసులు జారీ చేసి.. అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చేయాలని భావిస్తున్నట్లుంద టీడీపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన కాల్ మనీ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారని అమెను ఏకంగా ఏడాది కాలం పాటు అసెంబ్లీకి దూరం చేసిన బాబు సర్కార్.. మళ్లీ అమెపై అదే తరహా కత్తి దూయడానికి సిద్దమైంది.

రోజాకు మరో నోటీసు ఇచ్చేందుకు ఏపీ అసెంబ్లీ అధికార యంత్రాంగం సిద్ధమైపోయింది. అయినా రోజాకు ఈ తాజా నోటీసులు జారీ కాబోతుండటానికి గల కారణాలను విశ్లేషిస్తే... ఇలా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వోచ్చా..? అసెంబ్లీలోనూ, కనీసం అసెంబ్లీ అవరణలోనూ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వీలు కల్పించకుండా.. అదును చూసి వేటు వేయాలని ప్రభుత్వం చూస్తుండటం, అమేరకు ముందుగా నోటీసులను పంపించాలని నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యకం అవుతున్నాయి.

అయితే ఈ దఫా ఆమెకు నోటీసులు ఇవ్వడానికి గల కారణాల విషయానికి వస్తే... భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఇవాళ ఉదయం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు - ఎంపీలు ఓటు వేసేందుకు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా హాజరై.. వారితోనే కలిసి పోలింగ్ బూత్ కు చేరకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే రోజా.. వెనువెంటనే అక్కడున్న మీడియాతో స్పీకర్ వ్యవహారం అక్షేపనీయమన్నారు. స్పీకర్ హోదాలోని వ్యక్తి పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సింది పోయి.. సోంత పార్టీ ఎమ్మెల్యేలతో కలసి నడవటం సమంజసం కాదని అన్నారు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గానీ కేఆర్ సురేశ్ రెడ్డి గానీ ఏనాడూ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాలకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా స్పీకర్ స్థానానికి గౌరవం ఇచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా ధరించలేదని చెప్పుకొచ్చారు.

అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్... టీడీపీ ఎమ్మెల్యేలకు అవగాహన కోసం నిర్వహించే సమావేశానికి ఎలా వెళతారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కోడెల...అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఇది సరైనదో కాదో తేల్చుకునే విషయాన్ని కోడెల విజ్ఞతకే వదిలేస్తున్నానని కూడా ఆమె అన్నారు. స్పీకర్ దృష్టికి విషయం తెలిసి.. అసెంబ్లీ అవరణలో తనపై అనుచిత వ్యాక్యలు చేయడం పట్ల మరోమారు నోటీసులు అందించేందుకు సిద్దం చేయాలని అసెంబ్లీ సిబ్బందిని అదేశించినట్లు సమాచారం. అయితే మరి ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles