Video of Sasikala's Kitchen in Jail deleted రూపా అధారం మిస్.. మళ్లీ సొంతశాఖే దోషి..

Video of sasikala s kitchen in jail deleted

VK Sasikala, sasikala kitchen video, ips d roopa, AIADMK, Bengaluru jail, Karnataka, DG Prisons, Roopa Moudgil, Exclusive kitchen, Sasikala jail bribe, Sasikala Bengaluru jail kitchen, D Roopa, Sasikala, Big News, Bengaluru Jail, AIADMK, siddaramaiah, karnataka

Deputy Director General (Prisons) D Roopa exposed the VIP Treatment offered to AIADMK chief VK Sasikala Natarajan in Parappana Agrahara Central Jail.

రూపా అధారం మిస్.. మళ్లీ సొంతశాఖే దోషి..

Posted: 07/15/2017 11:23 AM IST
Video of sasikala s kitchen in jail deleted

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారన్న అంశాలను వెలుగులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వున్న పలువురు మహిళా పోలీసు అధికారులు, నెట్ జనులు, మహిళల నుంచి అమెకు మద్దతు లభిస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అంశాలను అమె ధైర్యంగా వెలుగులోకి తీసుకురావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా సోషల్ మీడియాలో డిఐజీ రూపను అభినందించారు.

ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా నిజాలు భయటపెట్టినందుకు సాటి మహిళగా గర్వపడుతున్నానని బేడీ అన్నారు. దేశంలోని మహిళా అధికారులందరూ ఇలాగే ధైర్యంగా విధులు నిర్వహించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కిరణ్ బేడీ వ్యాఖ్యలకు డీఐజీ రూప స్పందించారు.  సోషల్ మీడియాలో కిరణ్ బేడీకి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ బేడీ అభినందించడంతో తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ఉందని తెలుపుతూ రూప సోషల్ మీడియాలో కిరణ్ బేడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుండగా, శశికళ ప్రత్యేక వంటగదికి సంబంధించిన వీడియోను తమ శాఖకు చెందిన అధికారులే డిలీట్ చేశారన్న వార్త కూడా ప్రస్తుతం బెంగుళూరు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. శశికళకు రాచమర్యాదలు అందిస్తున్న విషయమై అటు కర్ఱాటక రాజకీయాల్లో ప్రకంపనలు చోటుచేసుకోగా, అందుకు సంబంధించి ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి విచారణకు కూడా అదేశించారు. అయితే తన వద్ద శశికళ వంటగదికి సంబంధించిన అధారాలు వున్నాయని చెప్పుకోచ్చిన రూపా.. తాజాగా ప్లేటు ఫిరాయించారు.

తన సెల్ ఫోన్ లో కెమెరా కొంత ఇబ్బందిగా మారడంతో తాను ఇంటినుంచి హ్యాండీ కామ్ ను తీసుకువచ్చి.. దాంతోనే శశికళ వంటగదితో పాటు అమెకు కేటాయించిన ప్రత్యేక సౌకర్యాలను తన కెమెరాలో షూట్ చేశారనని, వాటిని ఓ పెన్ డ్రైవ్ లో పెట్టించి ఇవ్వాలని తన స్టాప్ ను అదేశించానని చెప్పారు. అయితే స్టాప్ తనకు హ్యాండీ కామ్ ఇచ్చిన తరువాత దానిని పరిశీలిస్తే.. అందులో శశికళకు సంబంధించిన వీడియో లేదని.. దానిని అధికారులే డిలీట్ చేశారని అమె అరోపిస్తున్నారు. దీంతో విచారణ కమిటీ ముందు అమె అధారాలను చూపలేరని, కేవలం వాదనలను మాత్రమే వినిపించగలరని స్పష్టమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D. Roopa  sasikala  Bengaluru  parappana agrahara jail  video  AIADMK  karnataka  

Other Articles