Warangal Rakhta Charitra TRS Corporator Brutally Murdered

Trs corporator hacked to death

Warangal Rakhta Charitra, TRS Corporator, Corporator Murder, TRS Leader Hacked, Anisetti Murali Murder, Anisetti Murali Death, Anisetti Murali Wife, Anisetti Murali Death TRS Elections, Warangal Corporator Murder

Anisetti Murali, 44th Division TRS Corporator of Warangal Municipal Corporation was brutally murdered in his house at Kumarapally by Chinna Gang.Later Accused surrender.

పాతికేళ్ల పగ తీరిపోయింది

Posted: 07/14/2017 08:38 AM IST
Trs corporator hacked to death

హత్యా రాజకీయాలతో ఒరుగల్లు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ ను సినీ ఫక్కీలో వెంటాడి మరీ దారుణంగా నరికి చంపారు. పాత కక్ష్యలతోనే ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వరంగల్ కార్పొరేషన్ కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ అనిశెట్టి ముర‌ళి. నగరపాలక సంస్థలోని 44వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈ మధ్యే ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చాడు. పాతికేళ్లుగా ఓ వర్గంతో ఆయనకు అస్సలు పడటం లేదు. మధ్య మధ్యలో విమర్శలు, చిన్న చిన్న దాడులు చేసుకున్నప్పటికీ చంపుకునేంత స్థఆయికి చేరుకోలేదు. అయితే రాజకీయంగా మురళి ఎదుగుదల ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. ఈ క్రమంలో పక్కా ఫ్లాన్ తో హత్యకు కుట్ర చేసింది.

వ‌రంగ‌ల్‌ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధి కుమార్ ప‌ల్లిలో గురువారం ఆయనను ప‌లువురు దుండ‌గులు వేట‌ కొడ‌వ‌ళ్లు, క‌త్తుల‌తో వ‌చ్చి ముర‌ళీపై విచక్ష‌ణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దారుణానికి పాల్ప‌డిన అనంత‌రం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చిన్నా గ్యాంగ్ ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ముర‌ళికి భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ మరికొందరు మురళి కుటుంబాన్ని పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  TRS Corporator  Brutal Murder  

Other Articles