MLA stirs up storm during visit to Maoist hotbeds ప్రజా సమస్యలను భుజాన వేసుకుంటాడనుకుంటే..

Odisha mla defends being carried by supporters through mud

BJD MLA Manas Madkami, BJD, BJD MLA carried by supporters, Malkangiri, Biju Janata Dal MLA, Nabarangpur MP, Balabhadra Majhi, panchayats, Motu area, Odisha

Biju Janata Dal (BJD) MLA Manas Madkami loves his sparkling white shoes so much that he wouldn't mind being lifted and carried by his supporters to prevent them from getting dirty.

ప్రజా సమస్యలను భుజాన వేసుకుంటాడనుకుంటే..

Posted: 07/13/2017 08:39 PM IST
Odisha mla defends being carried by supporters through mud

ప్రజా సమస్యలను తన భుభాలపై వేసుకుని తమను కష్టాల కడలి నుంచి లాగుతాడని భావించి మల్కన్ గిరి ప్రాంత ప్రజలు అధికార పార్టీకి చెందిన మానస్ మద్కామిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకోగా.. ఆయన మాత్రం ప్రజల భుజాన ఎక్కి విహరిస్తున్నారు. పైగా ఈ చర్యలపై స్పందన కోరిన మీడియాతో ఆయన అది వాళ్ల అభిమానమని, తమ ఎమ్మెల్యే నీళ్లలో నుంచి నడవడమేంటని వారే ఇలా చేశారని తన చర్యలను నిసిగ్గుగా సమర్థించుకున్నారు.

అయితే ప్రలజకు మాత్రమే తమ నాయకులపై ప్రేమ వుంటుందా..? నాయకులకు మాత్రం తమ ప్రజలపై, మద్దతుదారులపై ప్రేమ వుండదా..? వుంటే ఆయన గెలిచి దాదాపు నాలుగేళ్లు కావస్తున్న చిన్న వర్షానికే ఇలా వచ్చిన నీరు.. భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటని, తన నియోజకవర్గ ప్రజలు తమ అవసరాల కోసం గ్రామం దాటి వెళ్లాలంటే ఎలా వెళ్తారన్న అలోచనైనా చేశారా..? చేసివుంటే ఈ పాటికి అక్కడ చెక్కల సాయంతో వంతెనకు బదులు శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మితమై వుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మాల్కన్ గిరి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మానస్ మద్కమి తన నియోజకవర్గంలోని పలు పంచాయితీలను సందర్శించారు. అయనతో పాటు నబరంగ్ పూర్ ఎంపీ బాలభద్ర మాంఝీ కూడా వెళ్లారు. అయితే వారి దారిలో వున్న బురద కాలువను ఎంపీ ఎవరి సాయంలేకుండా దాటగా, ఎమ్మెల్యే మాత్రం సంశయంలో పడగగా, అయన మద్దతుదారులు ఆయనను వారి భుజాలపై ఎక్కించుకుని మోసుకెళ్లారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJD MLA  Manas Madkami  Nabarangpur MP  Balabhadra Majhi  panchayats  Motu area  Malkangiri  Odisha  

Other Articles