Mandatory Voting in India Impossible Centre to SC

Sc argues voting not a fundamental duty

India, India Voting, Vote Fundamental Duty, India Vote Not Compulsory, Supreme Court of India, India Supreme Court on Vote, Right to Not Vote, Right to vote, Voting Compulsory India

The Centre said this in response to a 2015 petition filed by one Satyaprakash, who wanted mandatory voting to be enforced in India. He had cited the example of Gujarat, the only state in the country to introduce this concept, in support of his plea.The Union ministry of law and justice’s affidavit, which relied on the law commission’s report to counter the petitioner’s demand, stated that making voting compulsory would be undemocratic. The country’s election law provides citizens not only with the right to vote but also to refrain from voting during electoral exercises, it added.

ఓటేయడం కంపల్సరీ ఎలా అవుతుంది?

Posted: 07/10/2017 12:13 PM IST
Sc argues voting not a fundamental duty

ప్రభుత్వాల తలరాతలు నిర్ణయించే హక్కును ఓటుతో సామాన్యులకు కల్పించింది మన రాజ్యాంగం. అయితే అది ప్రాథమిక విధి కిందకు వస్తుందా? రాదా? అన్న దానిపై దశాబ్దాలుగా చర్చ నడుస్తూనే
ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్నప్తి చేస్తోంది.

రెండేళ్ల క్రితం సత్యప్రకాశ్ అనే వ్యక్తి సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఓటు హక్కును తప్పనిసరి చేస్తూ చట్టం తేవాలని, ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం అమలు చేస్తోందని వివరించాడు. అర్జెంటీనా, బెల్జియం మరియు బ్రెజిల్ లాంటి కొన్ని దేశాలు కూడా ఓటు వేయటం తప్పనిసరిని చేశాయని గుర్తు చేశాడు. మరోపక్క ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం కూడా ఎప్పటి నుంచో భావిస్తూ వస్తోందన్న ప్రస్తావనను పిటిషనర్ గుర్తు చేశాడు. అయితే ఓటు హక్కు వినియోగం పౌరుల ప్రాథమిక విధి కిందకు రాదని, కాబట్టి దానిని తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.

ప్రతిగా కేంద్ర న్యాయశాఖ కోర్టుకు ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఓటింగ్ తప్పనిసరి చేయడం అప్రజాస్వామిక చర్యగా అందులో పేర్కొంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి పౌరులకు ఓటు హక్కు కల్పించాం. స్వేచ్ఛ హక్కులో భాగంగా ఓటు వేయటం, వేయకపోవటం వాళ్ల విజ్నతకే వదిలేయాలి. ఎన్నికల చట్టం కూడా దానిని వినియోగించడాన్ని మాత్రం తప్పనిసరి చేయలేదని తెలిపింది. ఎన్నికల సంఘం కూడా  ఓటు హక్కు కల్పించనట్లే, ఓటు వేయకపోవటమనే హక్కు కూడా రాజ్యాంగం కల్పించిందని చెబుతోంది.

పైగా ఇటువంటి పిటిషన్లను అనుమతిస్తూ పోతే ఇటువంటివే మరికొన్ని వచ్చి పడతాయని, ఫలితంగా విధానాలు, చట్టాల రూపకల్పనకు ఇబ్బందిగా మారుతుందని, పైగా ఈ అంశం బాగా ఖర్చుతో కూడుకున్న వ్వవహారం అని కేంద్రం తన వాదనలో పేర్కొంది. దీంతో జస్టిస్ ఛలమేశ్వర నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ నేపథ్యంలో సరైన అభ్యర్థనతో రావాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాదులకు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Election Commission  Right to Vote  Supreme Court  

Other Articles