Groom Left Bride in First Night and Ran away

Bride shocked with groom ran away tamil nadu

Tamil Nadu, Tirunelveli Groom, Tirunelveli Bride Groom, Tirunelveli Couple, Groom Cheat Bride First Nigh, Tamil Nadu Couple, Bride Ran Away, Groom Ran Away, Tirunelveli Case, First Night Bathroom, Bride Groom Bathroom

Tamil Nadu Groom absconds After marriage. In First Night she wants to go Bathroom and Escaped from there. Tirunelveli Police Registered Complaint and search for Antony Joseph(29).

ఫస్ట్ నైట్ రోజే భార్యకు ఊహించని షాక్

Posted: 07/10/2017 11:34 AM IST
Bride shocked with groom ran away tamil nadu

పెళ్లయ్యాక జరిగే మూడు రాత్రుల ముచ్చట కోసం కొత్తదంపతులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో మనకు తెలియంది కాదు. పెళ్లికి ముందు ఉండే గ్యాప్( ఒకరంటే ఒకరికి కాస్త అయిష్టత, కొత్తవాళ్లన్న భావన, భయం వగైరా.. వగైరా) కి ఈ తంతు పుల్ స్టాప్ పడుతుందని పెద్దలు కూడా భావిస్తుంటారు. సరిగ్గా ఇక్కడో దంపతులు కూడా అలాంటి క్షణాల కోసమే ఎదురుచూశారు. సమయం రానే వచ్చింది.. అయితే పెళ్లి కొడుకు మాత్రం గదిలో తన కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురికే పెద్ద షాకిచ్చాడు.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా వీకేపురానికి చెందిన ఆంటోని జోసెఫ్‌ (29) కు తాట్టంపట్టికి చెందిన ఓ నర్స్ తో వివాహం జరిగింది. వధువుకు తల్లిదండ్రులు లేకపోవటంతో బంధువులే భారీగా కట్నాలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేయించారు. అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. పెద్దలంతా కలిసి శోభనం ముహూర్తం కూడా నిర్ణయించారు. అనుకున్న ముహుర్తానికి ముందే శోభనం గదిలోకి వెళ్లి వరుడి వెయిట్ చేస్తూ ఉండగా, వధువును అమ్మలక్కలు లోపలికి పంపించేశారు.

సిగ్గుతో లోపలికి అడుగుపెట్టిన ఆమెకు కొత్త పెళ్లి కొడుకు ముఖంలో విచిత్రమైన ఫీలింగ్ కనిపించింది. తనకు కడుపునొప్పిగా ఉంది, టాయిలెట్‌ కు వెళ్లివస్తానని చెప్పటంతో ఆమె సరే అంది. అలా వెళ్లిన జోసెఫ్ తెల్లారే దాకా కూడా రాలేదు. దీంతో ఏడుస్తూ ఈ విషయాన్ని పెద్దలకు విషయం తెలిపింది నవ వధువు. విషయం అర్థమైన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే చెప్పాలని వారంటుండగా, తమ కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేని జోసెఫ్ పేరెంట్స్ చెబుతున్నారు. ఇక పోలీసులు ఎక్కడున్నా అతగాడిని పట్టుకుంటామని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  New Wed Bride  Groom Ran away  

Other Articles