Rapist Shocks to Police with Comment in Facebook

Rapist reply to police wanted post

US Police, Rapist, Rapist Facebook Post, Rapist Reply Police Shock, Facebook Post, Rapist Derek Helms, Rapist Good Conduct, Rapist Thank You Reply

Rape Suspect Comments On His Own 'Wanted' Facebook Post In US. Derek Helms, on the run in connection with the rape and kidnapping case, commented on the post, insisting that he is innocent.

రేపిస్ట్ రిప్లై.. పోలీసుల మైండ్ బ్లాక్

Posted: 07/08/2017 11:29 AM IST
Rapist reply to police wanted post

అమెరికాలో ఓ రేపిస్ట్ ఇచ్చిన ట్విస్ట్ కు పోలీసుల దిమ్మ తిరిగిపోయింది. కిడ్నాప్‌, రేప్ నేరానికి పాల్ప‌డి ప‌రారీలో ఉన్న 28 ఏళ్ల ఓ నేర‌స్థుడిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఓ పని చేశారు. ఏకంగా సోషల్ మీడియాలో అతని గురించి పూర్తి వివరాలతో ఓ పోస్ట్ పెట్టేశారు. అయితే ఇక్కడే ఓ ఊహించని ఘటన జరిగింది.

వాషింగ్ట‌న్‌లోని నార్త్ క‌రోలినాలో డెరెక్ లీ హెమ్స్‌ ఓ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. అక్కడి పోలీసులు ఫేస్‌బుక్‌లో అతని ఫోటో, సమాచారం ఇవ్వాలంటూ ఓ పోస్ట్ పెట్టారు. నేర‌స్థునికి వ్య‌క్తిగతంగా ప‌రిచ‌య‌మున్న ఒక వ్య‌క్తి `ఇత‌ను అలాంటి వాడు కాదు.. చాలా మంచివాడు` అని కామెంట్ చేశాడు. దానికి రిప్లైగా స్వ‌యంగా నేర‌స్థుడే `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌.. త్వ‌ర‌లో నిజం బ‌య‌ట‌ప‌డుతుంది` అని కామెంట్ పెట్టాడు.

కామెంట్ చూసి పోలీసులు షాక‌య్యారు. వెంటనే తేరుకుని `నువ్వు ఎక్క‌డున్నా స‌రే.. త్వ‌ర‌గా లొంగిపో` అంటూ పోలీసులు మరో కామెంట్ పెట్టారు. ఐపీ అడ్రస్ తో అతన్ని కనిపెట్టే యత్నంలో ఉన్న పోలీసులు తీవ్రమైన నేరంలో అతగాడు ఇరుక్కోవటంతో కఠినమైన చట్టాల కిందే కేసు నమోదైందని పోలీసులు చెబుతుండగా, అతను అమాయకుడని తల్లి మార్గరెట్ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Police  Facebook Post  Rapist Reply  

Other Articles