Road rage drives groom to hospital in Ludhiana పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. అస్పత్రి మెట్లు ఎక్కాడు..

Wedding delayed road rage drives groom to hospital in ludhiana

bridegroom, chand kumar, road rage, Wedding, hospitalised, Maruti Alto car, model town, ambedkar nagar, dhakka colony, ceremonial sword, CCTV camera, Ludhiana, Punjab

A bridegroom, who was on his way to the bride’s house to solemnise the marriage, landed in hospital after a group of men thrashed him when their car hit some women dancing as part of the wedding procession.

పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. అస్పత్రి మెట్లు ఎక్కాడు..

Posted: 07/05/2017 04:59 PM IST
Wedding delayed road rage drives groom to hospital in ludhiana

మరికాసేపట్లో తాను కలలు కంటున్న తరుణం రానుంది. తన జీవితంలోకి మరో వ్యక్తిని అహ్వానించాల్సిన శుభతరుణం వచ్చేసింది. నూనూగు మీసాల నూత్న యవ్వనము నుంచి కళ్యాణ గడియల వచ్చి ఇకపై తాను ఒకరి వశం అవుతున్న శుభతరుణంలో మరికాసేట్లో అమె మెడలో మాంగళ్యం కడతానని, కలల ప్రపంచంలో విహరిస్తూ గుర్రపు స్వారీపై చేతిలో సంప్రదాయక ఖడ్గాన్ని పట్టుకుని పెళ్లి మండపానికి బయలుదేరిన ఓ పెళ్లికొడుకు.. అనూహ్యంగా అస్పత్రి మెట్లు ఎక్కాడు. ఎందుకిలా అంటే.. వరుడ్ని మహిళలు చావగొట్టారు. మహిళలే కాదు వారికి మద్దుతుగా వచ్చిన పురుషపుంగములు కూడా తలా ఓ చెయ్యి వేసే సరికి వరుడు అస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.

మ్యాటర్ లోకి ఎంటరైతే... పంజాబ్ లోని లుధియానాకి చెందిన చాంద్‌ కుమార్‌ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌ నుంచి చాంద్‌ కుమార్‌ని అతని స్నేహితులు వూరేగింపుగా (భారాత్) తీసుకెళుతున్నారు. ముందు ఊరేగింపు సాగుతుండగా.. దాని వెనుక కుమార్ స్నేహితులు కారులో వెళ్తున్నారు. ఆ వెనుకు కుమార్‌ గుర్రంపై వస్తూ.. చేతిలో సంప్రదాయ బద్దంగా వస్తున్న ఖడ్గాన్ని చేతితో పట్టుకుని వస్తున్నాడు. కారు ఓ కాలనీ వద్దకు చేరుకోగానే అక్కడున్న కొందరు మహిళల్ని రమారమి ఢీకొట్టేలా మీదకు దూసుకెళ్లింది. దీంతో మహిళలు కారులోని వ్యక్తులతో గొడవపడ్డారు.

వరుడు కుమార్‌ మహిళలకు సర్దిచెప్పేందుకు యత్నించగా, వారు వినిపించుకోలేదు. ఇంతలో అక్కడకు చేరుకున్న వారి తాలుకు మగవారు.. కుమార్ స్నేహితులను చావగోట్టారు. అడ్డుకోబోయిన కుమార్ కు కూడా గాయాలయ్యాయి. దీంతో పెళ్లి భారాత్ లో ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపు.. వరుగి చేతిలోని ఖడ్గాన్ని లాక్కుని మహిళలు, వారి తాలుకు వ్యక్తులు పరారయ్యారు. దాంతో మండపానికి వెళ్లాల్సిన పెళ్లికొడుకుకు గాయాలు కావడంతో పోలీసులు చాంద్ కుమార్ ను అసుప్రతికి తరలించి చికిత్స చేయించారు.

ప్రాథమిక చికిత్స చేయించుకున్న తరువాత వరుడు మండపానికి వెళ్లాల్సి వచ్చింది. మహిళలతో గొడవకు దిగిన సమయంలో కుమార్‌ స్నేహితులు తాగి ఉన్నారని, మహిళలకు గాయాలు కాకపోయినా వారిపై చేయిచేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆ మహిళలను, వారితో వున్నవారిని పట్టుకుంటామని మోడల్ టౌన్ పోలీసులు తెలిపారు. కాగా ఇరువర్గాలు సమ్మతికి వస్తే రాజీ కుదిర్చేందుకు తాము ముందుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bridegroom  chand kumar  road rage  Wedding  hospitalised  Ludhiana  Punjab  

Other Articles