World Raised Eye Brows on Modi Trump Chemistry

Modi finished america visit

PM Narendra Modi US Tour Finished, In White House Donald Trump and Melania invite Modi. Both join hands and pray to fight against terrorism. Modi White House Meet Deatils, US CEOs Modi, Modi Melania Trump, Melania Dress Modi, Modi Netherlands Tour, Modi Trump Friendship, Modi Trump Chemistry

Narendra Modi-Donald Trump meet.Strong on terror, rich in symbolism, steadfast on path to 'true friendship'. After finished US tour modi flay to Netherlands.

హమ్మయ్యా! మోదీజీ.. ఓ పనైపోయింది

Posted: 06/27/2017 09:16 AM IST
Modi finished america visit

హంగులు, ఆర్భాటాలు లేకుండానే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. వైట్ హౌజ్ లో సోమవారం(మంగళవారం పొద్దున) అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. వైట్‌హౌస్‌లో తనకు దక్కిన అపూర్వ ఆదరణ 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివర్ణించాడు. అగ్రరాజ్యం బలంగా ఉంటేనే భారత్ లాభపడుతుందని మోదీ వ్యాఖ్యానించాడు.

ఇక అంతకు ముందు మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. మోదీ ఓ గొప్ప ప్రధాని అంటూ కొనియాడాడు. దేశంలో ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చారన్నాడు. అయితే భారత్-అమెరికా మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ దృఢంగా, గొప్పగా లేవని ట్రంప్ ప్రస్తావించటం విశేషం. ఇక వాణిజ్య ఒప్పందాలతోపాటు ఆఫ్ఘనిస్థాన్ సహా పలు ప్రాంతీయ సమస్యలపై ఇద్దరూ చర్చించారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, దాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తామని ప్రతినబూనారు.

పాక్ కు షాక్...

మోదీ-ట్రంప్ మీటింగ్‌కు కొన్ని గంటల ముందు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన అమెరికా మోదీకి ఘన స్వాగతం పలికింది. తద్వరా పాకిస్థాన్ కు మరో షాకిచ్చినట్లు అయ్యింది. ఇంతకు ముందు ఆర్మీ గ్రాంట్స్ ను రుణం కింద జమచేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాకే ఇచ్చింది.


మెలానియా ఎట్రాక్షన్...

మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో మెలానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలానియా ధరించిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి. స్వతహాగా కురచ దుస్తులు, మోడ్రన్ దుస్తులు ధరించే మెలానియా మోదీకి ఆహ్వానం సమయంలో పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న పొడవైన డ్రెస్ (పుక్కి) ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా మోడ్రన్ డ్రెస్సులు ధరించే మెలానియా,  ఇప్పుడు అందుకు భిన్నంగా పాదాలు కూడా కనిపించని పుక్కి ధరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు మన దగ్గరి భామలు రెచ్చిపోయి స్కర్ట్ లు వేసుకుని ప్రధానిని కలుస్తుంటే.. ఓ విదేశీ మహిళగా మెలానియా కంప్లీట్ గా కప్పుకున్న డ్రస్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

Melania Attractive Dress Meet with Modi

 

వైట్‌హౌస్‌లో విదేశీ నేతకు ట్రంప్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. తద్వారా మోదీకి ట్రంప్ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 2014లో ఒబామా హయాంలో మోదీ అమెరికాలో పర్యటించినప్పటికీ వైట్‌హౌస్‌లో ఆయన విందుకు హాజరు కాలేదు. అప్పట్లో మోదీ నవరాత్రి ఉపవాస దీక్షలో ఉండడమే కారణం.

నెక్స్ట్ నెదర్లాండ్...

 ఇక అమెరికాలో పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం నెదర్లాండ్స్ బయలుదేరారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన చివరిగా నెదర్లాండ్స్‌లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశమై ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై చర్చించటంతోపాటు పలు కంపెనీల సీఈవోలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Donald Trump  US Visit  

Other Articles