Priest Nabbed for Raping Teen Girl in Bangalore

Teen raped by priest in bangalore

Bangalore, Bangalore Priest Rape, Priest Rape Case, Priest Rape India, Indian Priest Rape, Bangalore Teen Raped, Karnataka Priest Rape, Priest Rape Teen Girl, Hosur Main Road Temple, Priest Cheating Girl

A 20-year-old temple priest has been arrested for allegedly raping a minor girl in Bangalore. The accused had taken the girl to his house allotted by the temple authorities at Hosur main road where he allegedly raped the girl.

ఘోరం: ఆశ్రయం వంకతో అత్యాచారం

Posted: 06/27/2017 10:13 AM IST
Teen raped by priest in bangalore

బెంగళూర్ లో ఓ యంగ్ పూజారి చేసిన నిర్వాకం హాట్ టాపిక్ గా మారింది. తనతో పాటు స్కూల్లో చదివిన ఓ అమ్మాయిని నెలరోజులుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. పైగా ఆ అమ్మాయి తన భార్య అని చెబుతూ చుట్టుపక్కల వారిని నమ్మించే పని చేశాడు కూడా.

తుముకూరు చిక్కనాయకన్ హళ్లి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి ఇంట్లో అమ్మా నాన్న తిట్టారన్న కోపంతో కొంత డబ్బుతో పారిపోయింది. ఎక్కడికి వెళ్లాలో తెలీక అప్పటికే తనకు పరిచయం ఉన్న దీపక్(20) కు ఫోన్ చేసింది. ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికి తన దగ్గరకు రమ్మన్నాడు. ఇతగాడు హోసూరు ప్రధాన రహదారిపై ఉన్న దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు.

ఇక తనతో ఉండేందుకు చుట్టుపక్కలవాళ్లు అభ్యంతరం చెబుతారు కాబట్టి ఆమెను ఒప్పించి పెళ్లయినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు. గుడి వెనకాల తనకు కేటాయించిన గదిలోనే ఆమెతో కాపురం మొదలుపెట్టాడు. పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోవైపు, కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా దీపక్ ను అనుమానించిన పోలీసులు, అతని ఇంటిని సోదా చేయగా అపస్మారక స్థితిలో యువతి కనిపించింది. ఆపై దీపక్ ను అరెస్ట్ చేసి ఐపీసీ 376, 366ఏ, 366 పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Hosur  Priest Rape  

Other Articles