Traffic killing Leader sent to Remand in Pakistan

Traffic cop denies pakistani legislator apoloy

Balochistan, Balochistan MPA, Balochistan Shameless, Balochistan Bloody Money, Balochistan MLA Accident, Balochistan Accident, Balochistan Leader Accident, Balochistan Traffic Killing, Balochistan Video, Balochistan Accident Video, Traffic killing Video, Abdul Majeed Khan Achakzai

'Shameless': Balochistan MPA Abdul Majeed Khan Achakzai who ran over traffic warden attacks the media in court. Will not take blood money, pardon MPA, says family of deceased policeman.

సారీ... మీ ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు!

Posted: 06/26/2017 03:16 PM IST
Traffic cop denies pakistani legislator apoloy

ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో కూడా ఉంది. కానీ, అది క్రూరంగానే ఉందనుకోండి.

ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి అతివేగంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను బలితీసుకున్న ఘటన సంచలనంగా మారింది. క్వెట్టాలోని ఓ కూడలిలో హాజి అత్తా ఉల్లా అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విధులు
నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీ కొట్టింది. తీరా చూస్తే ఆ కారు బెలూచిస్థాన్‌ అసెంబ్లీలో సభ్యుడు, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ఛైర్మన్‌ అయిన మాజిద్ ఖాన్ అచాక్‌ జాయ్‌ ది. ఆ సమయంలో ఆ కారును నడుపుతున్న వ్యక్తీ ఆయనే కావడం విశేషం. వెంటనే ఆయన ఆగకుండా పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన హాజీని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాగా, ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అతగాడి క్షమాపణలుగానీ, డబ్బుగానీ బాధిత కుటుంబం స్వీకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో మాజిద్ కు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఇక కోర్టుకు హాజరైన ఆయన మీడియాపై కూడా దాడి చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balochistan  Traffic Killing  Abdul Majeed Khan Achakzai  

Other Articles