Akhila or Shilpa, Who Quit Politics after Bypoll Result

Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

Nandyala By poll, Nandyala By Election, Nandyala Shilpa Mohan Reddy, Shilpa Mohan Reddy Akhila Priya, Akhila Priya Challenges, Nandyala Elections Quit Politics

YSRCP Leader Shilpa Mohan Reddy Accepts Minister Akhila Priya Challenge. If lost he quit politics as well as Akhila's said.

నంద్యాల బైపోల్: ఒకరి ఎగ్జిట్ మాత్రం ఖాయం!

Posted: 06/26/2017 02:17 PM IST
Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతుంది. అఖిల ప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి గా మారిన పోటీలో ఎవరిది గెలుపు అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు
ప్రారంభమైపోయాయి. ఈ నేథప్యంలో తాను ఓడిపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేసింది. పార్టీ విజయం సాధిస్తే ఈ ఘనత పార్టీ, కార్యకర్తలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనత అవుతుందని, అలా కాకుండా ఓటమిపాలైతే మాత్రం ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని ఆమె చెప్పింది.

నంద్యాల ఉపఎన్నికల్లో విజయం భూమా కుటుంబంతో పాటు నంద్యాల కేడర్ కు కూడా ప్రతిష్టాత్మకంగా మారిందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదేని ధీమా వ్యక్తం చేసింది. త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తాను రాజకీయాలను వదిలి వెళ్తానని, శిల్పా కూడా అదే పని చేస్తారా? అంటూ మంత్రి సవాల్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన శిల్పా తానూ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించాడు.

తెలుగుదేశం అధికార బలం ఈ ఎన్నికల్లో వాళ్ల అభ్యర్థిని గెలిపించే సమస్యే లేదన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే భవిష్యత్తు ఉంటుదన్న నమ్మకం, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల
భరోసాతోనే తాను పార్టీలో చేరానని చెప్పుకొచ్చాడు. తాను తెలుగుదేశంలో ఉన్నా దివంగత మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపఠాన్ని తన ఇంట్లో ఉంచుకున్నానని, ఆయన చూపించిన
అడుగుజాడల్లో నడుస్తానని తెలిపాడు.

ఇక 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు కారణంగానే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తాను ఓడిపోయానని శిల్పా వ్యాఖ్యానించాడు. నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకును కలిగివున్న ముస్లిం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, అదే తన ఓటమికి కారణమైందని పేర్కొన్నాడు. నంద్యాల నియోజకవర్గాన్ని తాను కూడా అభివృద్ధి చేశానని, ప్రస్తుతం వైకాపా కూడా ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉందని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం అసాధ్యమని, అధికారం, డబ్బుతో తెలుగుదేశం గెలవాలని అనుకుంటున్నా ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala By Poll  Akhila Priya  Shilpa Mohan Reddy  

Other Articles