40 Naxals killed in Operation Prahar Chhattisgarh

Anti naxal operation completed in chhattisgarh

Operation Prahar, Chhattisgarh Encounter, India Biggest Encounter, Maoist Encounter, Bijapur Encounter, Raighar Encounter, Anti-Naxal Operation, 40 Maoists Killed

Operation Prahar Successfully Completed in Chattisgarh. 40 Maoists Killed in Four Various Encounters.

తూటాల వర్షం.. 40 మంది మృతి

Posted: 06/26/2017 12:47 PM IST
Anti naxal operation completed in chhattisgarh

ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మూడు రోజుల్లో నాలుగు ఎన్ కౌంటర్ లు చేసి సుమారు 40మంది మావోలను మట్టుపెట్టాయి. తొండమార్కా ఎన్ కౌంటర్ లో 20 మంది మావోలను మట్టుపెట్టినట్లు బస్తర్ డీజీఐ సుందర్ రాజ్ ప్రకటించాడు. భారీగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఏరివేత ఆపరేషన్ ను నిర్వహించాయి.

మరోపక్క చింతగుఫా అడవుల్లో గడచిన మూడు రోజులుగా ఈ భీకర ఎన్ కౌంటర్ జరిగింది. సుమారు 60 గంటలకు పైగా సాగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసు డైరెక్టర్ జనరల్ అవస్తి పేర్కొన్నారు. ఇదే ఎన్ కౌంటర్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించారని ఆయన తెలిపారు. మొత్తం 500 మందికి పైగా జవాన్లు ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో మధ్య భారతావనిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో ఇదే అతిపెద్దది కావటం విశేషం.

ఇక ఇదే ప్రాంతంలో మరోకటి, బీజాపూర్ ప్రాంతంలో ఇంకోక ఎన్ కౌంటర్ జరిగాయి. వీటిలో ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. ఒక జవాన్ మాత్రం గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, మావోల్లోని కొందరికి ఆశచూపి కోవర్టులుగా మార్చేసి దళాలు ఇలా ప్రతీకార చర్యలకు దిగుతున్నాయని కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  Maoist Encounter  BSF Operation  

Other Articles