Team india sets a target of 282 for England ఇంగ్లాండ్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Team india sets a mammoth target of 282 for england

Women’s World Cup 2017, ICC Women’s World Cup 2017, england, england, Team India, Mithali raj, england vs india, india vs england, ind vs eng, eng vs ind, Women’s cricket World Cup, cricket news, cricket, sports news, latest news

India come into it brimming with confidence as the Mithali Raj-led side are on a 16 match unbeaten streak. England haven’t played an international game in over six months

ఇంగ్లాండ్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Posted: 06/24/2017 06:09 PM IST
Team india sets a mammoth target of 282 for england

మహిళల వన్డే ప్రపంచకప టీమిండియా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత టాపార్డర్ అత్యత్తమంగా రాణించింది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ ఎదుట భారత మహిళల జట్టు 282 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేశారు.

టీమిండియా మహిళల జట్టు ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ శుభారంభాన్నిచ్చారు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్ కు 26.5 ఓవర్లలో 144 పరుగులు జోడించారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఓపెనర్ మంధన కొద్దిలో శతకాన్ని మిస్ అయ్యి 90 పరుగులు సాధించింది. నైట్ బౌలింగ్ లో హజెల్ క్యాచ్ పట్టడంతో మంధన (72 బంతుల్లో 90: 11 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ బాట పట్టింది.

మరో ఓపెనర్ పూనమ్ రౌత్ హాఫ్ సెంచరీ (86: 7 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి స్కోరు బోర్డును నడిపించింది. 222 పరుగుల వద్ద హజెల్ బౌలింగ్ లో రౌత్ రెండో వికెట్ గా నిష్ర్రమించింది. కాగా చివర్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 71: 8 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్‌ (22 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో 50 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి నైట్ బౌలింగ్ లో మిథాలీ ఔటయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్ రెండు వికెట్లు తీయగా, హజెల్ కు ఓ వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  england  ind vs eng  icc womens world cup  cricket  

Other Articles