Gorkhaland Agitation Gas Cylinder Prices Skyrocketing

Indefinite shutdown in darjeeling lpg prices high rate

Gorkhaland Agitation, Darjeeling, LPG Prices Agitation, Darjeeling LPG Prices, Cylinder 1,200 to Rs 1,500, LPG Prices Gorkhaland, Darjeeling Tensions, Darjeeling Chaos, Gorkhaland State

Gorkhaland Agitation in Darjeeling effect on people. LPG cylinders in the hills are now selling like hot cakes, though consumers have to shell out as much as Rs 1,200 to Rs 1,500 per cylinder. “We can live on local food, but we need gas for cooking,” said Sushma Pokhrel, a housewife from Kurseong.

గ్యాస్ సిలిండర్ రేటు @1500/-

Posted: 06/22/2017 08:16 AM IST
Indefinite shutdown in darjeeling lpg prices high rate

సొంత రాష్ట్ర ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో పోరాటం నానాటికీ ఉదృతం అవుతోంది. రోడ్డెక్కిన నిరసనకారులు కనిపించిన వాహనానల్లా తగలబెట్టేస్తున్నారు. గుర్ఖాలాండ్ తక్షణమే ఏర్పరచకపోతే హింసాత్మకంగా మారుతుందని హెచ్చరికలు జారీ చేశారు కూడా. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీన్ లోకి దిగినా కూడా పరిస్థితి ఏ మాత్రం మారలేదంటే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక గత 13 రోజులగా అక్కడ సమ్మె వాతావరణమే నెలకొంది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సేవలు తప్పించి దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. దీనికి తోడు భారీ వర్షం కూడా జనాలను బయటకు రానీయడం లేదు. మొత్తానికి నగరం మొత్తం బోసి పోయినట్టు కనిపిస్తోంది. కాగా, సమ్మె కారణంగా డార్జిలింగ్‌లో వంటగ్యాస్ సిలిండర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒక్కో సిలిండర్‌ను రూ.1200-1500కు అమ్ముతున్నారు. 

తాము స్థానిక ఆహారంతోనే సరిపెట్టుకుంటున్నా వంటకు మాత్రం గ్యాస్ అవసరం కాబట్టి ధర ఎంతైనా కొనుక్కోక తప్పడం లేదని ఓ మహిళ పేర్కొంది. సమ్మె కారణంగా డార్జిలింగ్‌లోని హోటళ్లు, షాపులు, అన్ని సంస్థలు మూతపడడంతో రోడ్లపై కుర్రాళ్లు క్రికెట్, ఫుట్‌బాల్ తదతర ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘మా స్కూళ్లు మూతపడ్డాయి. మేం చేసేందుకు ఏమీ లేదు. అందుకే ఇంటి వద్దే ఆటలాడుకుంటున్నాం’’ అని వారంటున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం వైరల్ కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Darjeeling  Gorkhaland Agitation  LPG Prices  

Other Articles