police speedup investigation in beautician shirisha suicide శ్రావణ్ ను డార్లింగ్ అని పిలిచిన బ్యూటీషియన్ శీరీష..

Police speedup investigation in beautician shirisha suicide

banjara hills, film nagar, RJ photography, vallabhaneni rajeev kumar, tejaswini, software employee, prabhakar reddy, kukunoor police station, shirisha, sub inspector, sucide, beautician, beautician suspicious death, beautician in a city-based, Beautician death mystery, telangana, crime

Hyderabad police speedup investigation in the suicide case of beautician sirisha according to their voice samples which were sent to forsenic lab.

శ్రావణ్ ను డార్లింగ్ అని పిలిచిన బ్యూటీషియన్ శీరీష..?

Posted: 06/20/2017 12:00 PM IST
Police speedup investigation in beautician shirisha suicide

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విజయలక్ష్మి అలియాస్ శీరీష, కుకునూర్ పల్లి పోలిస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కేసులో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో మరింత వేగవంతంగా ఈ కేసును పూర్తిగా చేధించాలని భావిస్తున్న పోలీసులు కీలక అధారాలను రాబట్టుతున్నారు. శిరీషకు అమె పనిచేస్తున్న అర్జే ఫోటోగ్రహీ యజమాని రాజీవ్ కుమార్ కు అక్రమ సంబంధం వుందన్న విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో కనుగోన్నారు. అయితే ఉద్యోగాలు చేస్తున్న మహిళలపై ఇలాంటి ముద్రలు వేయడం సమంజసం కాదని మృతురాలి తల్లిదండ్రులు ఈ ఆరోపణలను ఖండిస్తున్న నేపథ్యంలో మరింత క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

నల్గొండ మాల్ కు శ్రావణ్.. ఎస్ఐ పరీక్షలు రాసేందుకు నగరానికి వచ్చి.. శిరీషతో పరిచయం చేసుకుని.. అటు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని.. ఇటు శిరీషను తన ట్రాప్ లో వేసుకుని వారు అత్మహత్యలు చేసుకునేందుకు కారణమయ్యాడని తెలిపిన పోలీసులు.. ఇక దర్యాప్తును ముమ్మరం చేయడంతో కొన్ని రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శిరీషది ఆత్మహత్యే అనే తేల్చిన పోలీసులు... శిరీషకు సంబంధించిన ఆడియో టేపులపై తాజాగా దృష్టి సారించారు. శిరీష, రాజీవ్, శ్రవణ్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బంజారాహిల్స్ పోలీసులు సేకరించారు.

ఈ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా శిరీష ఆడియోను పోలీసులు నిర్ధారించనున్నారు. ఈ క్రమంలో శిరీష.. తన స్నేహితుడైన శ్రావణ్ ను శిరీష డార్లింగ్ అంటూ సంబోధించిన విషయం తెలుసుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు. వీరిద్దరి మధ్య ఇంత సన్నిహిత్యం వుందా..? అది ఎంత వరకు వుందన్న కోణంలోనూ దర్యాప్తును ప్రారంభించారు. కేవలం సాయం చేద్దామని తాను ప్రయత్నించానని అయితే తనను ఈ కేసులో ఏ-1గా చేర్చడంపై తన అక్కస్సును వెళ్లగక్కిన శ్రావణ్.. నిజంగా అమాయకుడేనా.. అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

రాజీవ్.. తాను పెళ్లి చేసుకోవవాలని భావించిన యువతి తేజస్వినికి.. శిరీషకు మధ్య వున్న విబేధాలను శ్రావణ్ అసరగా చేసుకున్నాడా..? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఈ కోణంలో విచారించడానికి పోలీసులకు చిక్కిన అధారమే కీలకంగా మారింది. రాజీవ్.. తేజస్వినిల మధ్య ఎం సంభాషణ జరుగుతుందన్న వివరాలను, వారి మధ్య వున్న సంబంధాలపై శ్రావణ్ ద్వారా శిరీష ఎప్పటికప్పుడు అరా తీయడమే ఇందుకు కారణమైంది. ఈ క్రమంలో తేజస్విని తనకు శత్రువని కూడా శిరీష పేర్కొంది.

ఇక రాజీవ్ తేజస్వినీలు ఏం మాట్లడుకుంటున్నారన్న విషయాన్ని వాయిస్ రికార్డు చేసి తనకు పంపాలని కూడా శిరీష శ్రావణ్ ను కోరిందన్న విషయాలు పోలీసులు కనుగొన్నారు. "వాడు ఇందాక మాట్లాడింది విన్నావుగా... ఏం చెప్పాడు?" అంటూ శిరీష ప్రశ్నించింది. శిరీష మాటలకు సరేనన్న శ్రవణ్, "ఇక నువ్వు హ్యాపీగా ఉండు... దానికి టార్చర్ చూపిద్దాం" అని అనడం కూడా ఈ సంభాషణలో ఉంది. కాగా, పోలీసులకు మిస్టరీగా మారిన కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలన్న ఉద్దేశంతో పోలీసులు మరిన్ని ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banjara hills  kukunoorpally  RJ photography  beautician  prabhakar reddy  sravan  telangana  crime  

Other Articles