Another MP fires on Indigo airlines staff, supports JC ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారుల తీరు మరో ఎంపీ రుసరుస

Trs mp comes in support of tdp mp jc diwakar reddy fires on indigo airlines

JC Diwakar Reddy, Gutta Sukendar Reddy, gutta supports jc, trs mp backs tdp mp, indigo airlines staff, TDP MP Airlines, JC Diwakar Reddy Ban, Airlines Ban MP, Airlines MP Ban List, Another MP Airlines Ban, TDP MP Vixag Airport, Vishakapatnam Airport TDP MP, Vishakapatnam Airport JC Diwakar Reddy, MP JC Ban Airlines, Vishakapatnam Airport JC Diwakar Reddy, Anantapur MP Rucks, JC Diwakar Reddy Attack Airport Staff

Its good to see the mps of arch rival parties and ruling TRS and TDP from Telugu states comes in support of one another atleast on an issue outside the parliament. TRS MP Gutta Sukendar Reddy back MP JC Diwakar Reddy and fires on IndiGo airlines staff services.

ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారుల తీరు మరో ఎంపీ రుసరుస

Posted: 06/17/2017 03:02 PM IST
Trs mp comes in support of tdp mp jc diwakar reddy fires on indigo airlines

వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు.. అందులోనూ అధికార పక్షానికి చెందిన నేతలుగా కొనసాగుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిలా రాజుకుంటున్న అస్తుల పంపకాలు.. తదితర విషయాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నాయన్న టాక్ వుంది. ఇక ఈ రెండు ప్రాంతాల నేతలు అటు పార్లమెంటులోనూ ఇటు బయట కూడా ఉప్పు నిప్పు మాదిరిగానే వుంటారన్నది రాష్ట్ర విభజన సమయంలో తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలు చవిచూసిన విషయమే.

ఆంధ్రప్రదేశ్ అనంతపురానికి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఐతే తెలంగాణ అధికార పార్టీ మీద చెప్పలేనంత కోపం వుంది. అది అధికారుల పుణ్యమా.. లేక అనధికారల కారణమా అన్న విషయం వారికే తెలియాలి. ఈ మధ్యనే తమ ఈ ఎంపీ సోదరుడు.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని బస్సులను అడ్డుకోవడంతో ఆయన ఏకంగా అర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇదిలావుంటే ఇటీవలే ఆయన అల్లుడు దిపక్ రెడ్డిని కటకటాల వెనక్కి నెట్టారు తెలంగాణ పోలీసులు. దీంతో ఆయనకు తెలంగాణ అంటే కోపం వుండటం సహజం.

అయితే ఆయన ఎదుర్కోన్న ఈ పరిణామాల నేపథ్యంలో చోటుచేసుకున్న తాజా ఘటన విశాఖపట్నం విమానాశ్రయం ఘటన. అక్కడ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో ఆయన దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి కార్యాలయంలోకి చోచ్చుకెళ్లి.. అక్కడి సామాగ్రిని ధ్వంసం చేయడానికి కూడా యత్నించారన్న అరోపణలను ఎదుర్కొంటున్న వేళ.. ఆయనకు ఊహించని మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ తో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు మద్దతు ప్రకటించారు.

పార్లమెంటు సభ్యుల విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇండిగో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ సంస్థకు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వత్తాసు పలకడంతో వారు అడగాలు మరింత మితిమీరుతున్నాయని దుయ్యబట్టారు. తాను ఎంపీనన్న విషయాన్ని మర్చిపోయి పదవిలో వున్నామని తమ శాఖకు చెందిన ఎయిర్ లైన్స్ ఉద్యోగుల పక్షాన కేంద్రమంత్రి మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  Gutta Sukendar Reddy  TDP  TRS  IndiGo Airways  Vishakapatnam Airport  Travel Ban  

Other Articles