Beheading Remark Arrest Warrant against Baba Ramdev

Non bailable warrant issued against baba ramdev

Baba Ramdev, Baba Ramdev Case, Baba Ramdev Non-bailable Warrant, Yoga Guru Ramdev Baba, Ramdev Baba Beheading Remarks, Ramdev Baba Bharat Mata Ki Jai, Baba Ramdev Controversy

Non-bailable warrant against Baba Ramdev for 2016 'beheading' remark. The court of Additional Chief Judicial Magistrate Harish Goyal issued the non-bailable warrant against Ramdev and fixed August 3 as the next date of hearing in the case.

బాబా అతిదేశ భక్తికి పంచ్ పడింది

Posted: 06/15/2017 08:07 AM IST
Non bailable warrant issued against baba ramdev

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కు కొత్త చిక్కు వచ్చిపడింది. దేశ భక్తిని ప్రదర్శించుకునే క్రమంలో ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

గతేడాది(2016 ఏప్రిల్ 3న) హర్యానాలోని రోహ్ తక్ లో ఆర్ఎస్ఎస్ సద్భావన సమ్మేళన్ నిర్వహించింది. దీనికి హాజరైన రాందేవ్ సభికులనుద్దేశించి ప్రసగించాడు. దేశ చట్టాలను గౌరవించి ఓపిక పడుతున్నామని, లేని పక్షంలో భారత మాతా కీ జై అనకుండా వ్యవహారిస్తున్న(అవమానిస్తున్న) లక్షలాది మంది తలలు తెగనరుకుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ వ్యవహారాల మంత్రి సుభాష్ బాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కానీ, ఆయనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ముందుకు రాకపోవడంతో, నేరుగా రోహ్ తక్ న్యాయస్థానంలో సుభాష్ ఫిర్యాదు చేశాడు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణకు హాజరుకావాలని రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవటంతో యోగా గురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Mata Ki Jai  Baba Ramdev  Beheading Remarks  

Other Articles