No Mid Night for Petrol Price Changes in Daily Revision

Petrol pump dealers call off june 16 strike

Petrol Pump Dealers, Daily Revision Petrol, Mid Night Petrol Price, Petrol Pump Dealers Strike, Petrol Pump Dealers, Petrol Pump Owners, Petrol Pump Dealers Meeting, Petrol Pump Dealers Daily Revision, Mid Night Petrol Price, 6 AM Petrol Price

Petrol pump Dealers withdraw strike against daily revision of fuel prices. Until now price revisions used to come into effect from midnight but considering the fact that dealers would have to deploy manpower everyday to change rates in the middle of the night, the timing has now been changed at 6 AM Daily.

పొద్దున 6 నుంచే పెట్రోల్ కిక్కు

Posted: 06/15/2017 08:38 AM IST
Petrol pump dealers call off june 16 strike

రోజువారీ పెట్రోల్ ధరల సవరణ పద్ధతిపై పెట్రోల్ బంక్ యాజమాన్యాల సంఘం ఇచ్చిన బంద్ ను విరమించుకున్నాయి. ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో జరిగిన చర్చల అనంతరం వారు తాజా నిర్ణయాన్ని ప్రకటించారు.

రోజువారీ ధరల సవరణ లో భాగంగా అర్థరాత్రి పెంపు పద్ధతిని మార్చాలని పెట్రోల్ బంక్ యాజమాన్య సంఘాలు డిమాండ్ చేశాయి. ‘‘రాత్రి పెంపు ద్వారా కొన్ని గంటలపాటు బంకులు మూసేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరీ ముఖ్యంగా హైవేలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 58,000 పెట్రోల్ బంక్ ల్లో 70 శాతం దాకా హైవేలలోనే ఉన్నాయి’’ అని యాజమాన్య సంఘం ప్రభుత్వం ముందు వాదించింది. అందుకే ఉదయం 6 గంటల నుంచి మారిన రేటు అమలు అయ్యేలా చూడాలంటూ కోరాయి.

అర్థరాత్రి సవరణ పై అవసరమైన సాంకేతికత అందరికీ అందుబాటులో లేదని కేంద్ర మంత్రితో జరిగిన చర్చల సందర్భంగా పెట్రోల్ బంకుల యజమాన్య సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు రేటు సవరణ చేసి, ఆ సమాచారాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు అందజేస్తే మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి కొత్త రేటును ఆయా మెషీన్లలో ఫీడ్ చేసుకుంటారన్న మాట.

రేట్లు ఎలా తెలుసుకోవచ్చు?

రేపటి నుంచి (16 శుక్రవారం) ఉదయం నుంచి రోజువారీ పెట్రోల్ ధరల మార్పు నిర్ణయం అమల్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు నెలకు రెండు సార్లు (ప్రతి 15 రోజులకోసారి) మాత్రమే ధరలను సవరిస్తున్నారు. మరి ఏ రోజుకారోజు మారిపోయే ధరలను తెలుసుకోవడం ఎలా...? చాలా సింపుల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మొబైల్ యాప్ ఉంటే చాలు. దీని కోసం ప్లే స్టోర్ లో fuel@IOC అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవడమే. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో ఎస్ఎంఎస్ ద్వారా ధర గురించి తెలుసుకోవాలంటే RSP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DEALER CODE టైప్ చేసి 9224992249 నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలని ఐవోసీ తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol Price  Daily Revision  Mid Night  

Other Articles