Snake comes out of AC to eat rat పాముకు మంచి అడ్డా దొరికింది.. అహారం కూడా..!

Snake comes out of an air conditioner to hunt its prey

Snake, snake rat, snake Air Conditioner, snake eats Rats, snake kills rat, snake video, snake comes out of AC, snake kills rat, snake rat video goes viral, video viral, viral video

In this scorching summer, nobody would want to turn their ACs off, and it is not often that snakes peep out of air conditioners.

ITEMVIDEOS: పాముకు మంచి అడ్డా దొరికింది.. అహారం కూడా..!

Posted: 06/13/2017 03:32 PM IST
Snake comes out of an air conditioner to hunt its prey

వేసవిలో భానుడి ప్రకోపాన్ని రమారమి అన్ని దేశాలవారు చవిచూశారు. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఉదయం, సాయంత్రం, రాత్రిళ్లు కూడా నగరవాసులు ఉక్కబోతను భరించలేకపోయారు. దీంతో ప్రచండుడి నుంచి ఉపశమనం పోందేందుకు ఏవరికి తోచిన విధంగా వారు ఉపశమన మార్గాలను అన్వేషించుకున్నారు. ఈ క్రమంలో మధ్య, ఉన్నత వర్గాల వారు వారి ఇళ్లలో, కార్యాలయాల్లో ఏయిర్ కండీషనర్లకు రేయింబవళ్లు పని కల్పించారు.

వేసవి తాపం ముగిసిందని బావిస్తున్నా.. ఇంకా అప్పడప్పుడు భానుడి తమ ప్రతాపాన్ని చాటుతుండటంతో.. కొందరు ఏసీలను వాడుతుండగా, మరికొందరు ఏసీలను శుభ్రం చేసి ఇక మరో 8 నెలల వరకు నీతో పనిలేదు అని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి కుటుంబసభ్యలు అదిరిపడ్డారు. మిట్టమధ్యాహ్నం భానుడు ఇంకా ప్రతాపం చూపుతున్న క్రమంలో బెట్ రూమ్ లోకి వచ్చి సేదదీరుదామని అనుకున్న అ కుటుంబసభ్యలు ముందుగా షాక్ కు గురయ్యారు. వారిని షాక్ కు గురిచేసింది ఓ ఎలుక శబ్దం.

వారింటిలోని స్ల్పిట్ ఏసీ బాక్సులోకి జీవికి అహారంగా వెళ్తున్న ఎలుగ దానిన అది పట్టుకునేు క్రమంలో చేసిన శబ్దంతో కుటుంబసభ్యులు అలర్ట్ అయ్యారు. ఏంటా అని చూడగానే తమ ఏసీలోని జీవిని చూసి ఉల్లిక్కిపడ్డారు. తమ ఏసీలోంచి  ఒక పాము ఇంట్లోని ఎలుక‌ను నోటితో ప‌ట్టుకొని, తినేసి మ‌ళ్లీ ఏపీ బాక్సులోనికి చేరుకుని తన విందును అరగించింది. ఈ ఘటన సింగ‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ కుటుంబసభ్యులు నెల్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఒక్కసారిగా పామును చూసి షాక్ అయిన ఆ ఇంట్లోని వారు ఇన్నాళ్లూ తాము ఓ పాముతో పాటే ఇంట్లో ఉన్నామా? అని త‌ల‌చుకుని వ‌ణికిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake  rat  air conditioner  family  prey  viral video  

Other Articles