High Court Stay On Group 2 Recruitment Process

Hc on group 2 results and sc on neet results

TSPSC Group-2, Group 2 Results, TSPSC Group 2 Scam, Group 2 Results, Telangana Group 2, NEET Results, NEET 2017 Results, NEET 2017 Exams, NEET Madras High Court, SC NEET, NEET Results Date, TSPSC Frauds

High Court Stay on TSPSC Group-2 Results for Three Weeks. SC orders NEET results be declared on June 26.

హైకోర్డు స్టాప్, సుప్రీంకోర్టు రైట్.. రైట్

Posted: 06/12/2017 04:13 PM IST
Hc on group 2 results and sc on neet results

తెలంగాణ గ్రూప్‌-2పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పరీక్షలోఅక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై స్పందించి ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ లో సుమారు ఐదున్నర లక్షల మంది(5.65 లక్షల మంది) ఈ పరీక్ష రాయగా, వారం క్రితం టీఎస్పీఎస్పీ రిజల్ట్స్ ప్రటించింది.

వైట్ నర్ వాడిన అభ్యర్థులతోపాటు డబుల్ బబ్లింగ్ అభ్యర్థుల పేర్లు ఎంపికైన జాబితాలో ఉన్నాయి. దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో ఎంపిక ప్రక్రియ నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాలపాటు మౌఖిక పరీక్షను వాయిదా వేటయంతోపాటు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ఇంకోపక్క టీఎస్‌పీఎస్సీ పని తీరును పరిశీలించేందుకు తమిళనాడు నుంచి ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి దిగింది.

నీట్ రిజల్ట్స్ కు అనుమతి..

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇదివరకు నీట్ ఫలితాల విడుదల నిలుపుదలకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. ఫలితాల విడుదల నిలిపివేయాలని మద్రాస్ కోర్టు నిలుపుదల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 26 లోపు నీట్ ఫలితాలను విడుదల చేయాలని సీబీఎస్‌ఈకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో నీట్ రాసిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం విదితమే. 11,38,890 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Group 2  High Court  NEET  Supreme Court Results  

Other Articles