Vijay Mallya booed at The Oval as chor chor

Vijay mallya booed at oval stadium

Vijay Mallya, Vijay Mallya boo, Chor Chor Vijay Mallya, Vijay Mallya Oval Video, Fans Call Mallya Chor, Oval Vijay Mallya, Vijay Mallya ICC Champions Trophy, Beleaguered business tycoon Vijay Mallya

Vijay Mallya Great Insult at London. Fans Chant 'Chor Chor' as Vijay Mallya Enters Oval Arena for India-SA Clash.

ITEMVIDEOS:మాల్యా ఇజ్జత్ తీసి పడేశారుగా...

Posted: 06/12/2017 11:51 AM IST
Vijay mallya booed at oval stadium

వేల కోట్ల ఆర్థిక నేరంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న విజయ్ మాల్యా బిత్తర పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తనను ఇంకా దోషిగా నిర్ధారించలేదని, తనపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూ నిర్మోహమాటంగా తిరిగేస్తూ క్రికెట్ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్నే పాకిస్థాన్ ఇండియాల మధ్య మ్యాచ్ ను చూసి, ఆపై కోహ్లీ ఛారిటీ కార్యక్రమానికి కూడా హాజరై షాకిచ్చిన మాల్యా ఇప్పుడు మరోసారి అదే పని చేశాడు.

ఆదివారం ఓవల్ లో ఇండియా సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ను చూసేందుకు హాజరైన 61 ఏళ్ల మాల్యాకు ఘోర పరాభవం ఎదురైంది. స్టేడియంలో ఆయనను చూసిన ప్రేక్షకులు చోర్ నినాదాలు చేశారు. వారికి మరికొందరు జతకలవడంతో స్టేడియం హోరెత్తింది. మైదానంలోకి వేగంగా నడుచుకుని వెళ్తుండగా గమనించిన భారతీయ ప్రేక్షకులు ‘చోర్ గయా చోర్‘ (దొంగ వెళ్తున్నాడు), ‘చోర్, చోర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే అవేమీ పట్టించుకోని మాల్యా వడివడిగా అడుగులేసుకుంటూ స్టేడియంలోకి చేరారు.

 

భారత బ్యాంకులకు రూ.9వేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యా గతేడాది మార్చిలో లండన్ పారిపోయి తలదాచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Chor Chor Comments  Oval Stadium  

Other Articles