Jnanpith Award winner Narayana Reddy passes away

Jnanpith award winning writer narayana reddy died

C Narayana Reddy, Cingireddy Narayana Reddy, Writer Cinare, Jnanpith Awardee Narayana Reddy Dies, CInare Death, Cinare Dies, C Narayana Reddy Passes Away, Telugu Writer Passes Away, Telangana Writer Cinare Death, KCR Condolence to Cinare Death, Jnanpith award Narayana Reddy Death, Lyricist , Telangana Poet Cinare, Cinare Death

Cingireddy Narayana Reddy Jnanpith award winning litterateur, dies. He won the Jnanpith Award in 1988 and is considered to be an authority on Telugu literature. He is known as Cinare

సాహితీవేత్త సినారే కన్నుమూత

Posted: 06/12/2017 09:09 AM IST
Jnanpith award winning writer narayana reddy died

తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వంభర కావ్యానికి ఆయన జ్నానపీఠ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు ఆయన జన్మించారు. ఆయనది బాల్య వివాహం కాగా, సతీమణి పేరు సుశీల. సినారేకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు.ఆయన తన కలంపేరు 'సినారే'తో తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు.

1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం,, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆ్రస్టేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు. 

1977లో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని. 1988 లో జ్నానపీఠ్ అవార్డును అందుకుని రెండో తెలుగు వ్యక్తిగా నిలిచాడు(విశ్వనాధ సత్యనారాయణ మొదటి వ్యక్తి). ఏపీ అధికార భాష సంఘానికి అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. పద్మవిభూషణ్, పద్మశ్రీ, కళాప్రపూర్ణ, నంది పురస్కారాలు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి అన్ని అత్యుత్తమ అభినందనలు స్వీకరించిన ఘనత వహించిన సినారే రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటులో తనదైన బాణిని, వాణిని వినిపించి అందరి మన్ననలు పొందాడు.

ఆంధ్రా, ఉస్మానియానే కాదు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల నుంచి కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు కూడా. 1962 లో గుళేకాబవళి సినిమాతో ఆరంగ్రేటం చేసిన ఆయన మొత్తం 71 సినిమాలకు పాటలు రాశాడు. ‘గులేబకావళి’ కథ (1962) లోని ‘నన్ను దోచుకుందువటే’ పాట నుండి ‘అరుంధతి’ లో ‘జేజమ్మ’ పాట వరకు ఆయన ప్రస్థానం సాగింది. సినారే మృతిచెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

 

క‌వితా య‌శ‌స్వి
అక్ష‌ర త‌ప‌స్వి
గీత గోవిందుడు
గ‌జ‌ల్ గాంధ‌ర్వుడు
జ్ఞానపీఠాధిప‌తి
విజ్ఞాన స‌ర్వస్వాధిప‌తి.. ఇక సెలవు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jnanpith Awardee  Cingireddy Narayana Reddy  Death News  

Other Articles