Rahul Gandhi detained by police in MP బైక్ పై వెళ్లిన రాహుల్ ను కిడ్నాప్ చేశారా..?

Rahul gandhi stopped from entering mandsaur arrested

Rahul Gandhi, arrest, kidnap, Pipliamandi, Mandsaur, Congress, Narendra Modi, Madhya Pradesh, Kamal Nath, Digvijay Singh, farmers protest, rajnath singh, Madhya Pradesh farmers strike

Congress vice president Rahul Gandhi and other senior party leaders were arrested after they were placed under preventive custody, 56 km from riot-hit Pipliamandi area of Mandsaur

ITEMVIDEOS: బైక్ పై వెళ్లిన రాహుల్ ను కిడ్నాప్ చేశారా..?

Posted: 06/08/2017 05:41 PM IST
Rahul gandhi stopped from entering mandsaur arrested

మధ్యప్రదేశ్‌లో తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యమాన్ని చేస్తున్న రైత‌న్నలపై పోలీసులు ఉక్కపాదం మోపుతూ.. తుపాకుల తూటాలను ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఐదుగురు రైతులు అసువులు బాశారు. దీంతో అక్కడి రైతులు ప్రభుత్వంపై తీవ్ర అగ్రహంతో ఉద్యమాన్ని చేపడుతున్నారు. అన్నదాతలకు మద్దతు తెలపడానికి మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ ప్రాంతానికి వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మంద్ సౌర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి వీళ్లేదని చెప్పారు.

దీంతో రాహుల్ గాంధీ సాహసానికి తెర తీశారు. మాంద్ సౌర్ ప్రాంతంలో అన్నదాతల్ని కలుసుకునేందుకు ఆయన ఎవరూ ఊహించని రీతిలో ఆయన తన సెక్యూరిటీని కూడా వదిలి బైక్ మీద ప్రయాణించేందుకు రెఢీ అయ్యారు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. రాహుల్ ను బైక్ మీద మాందసౌర్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు.తాను మాందసౌర్ కు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. పోలీసులు తనను అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లుగా రాహుల్ తన ట్విట్టర్ అకౌంటర్ ద్వారా ట్వీట్ చేశారు.

మాందసౌర్ కు 180 కిలోమీటర్ల దూరంలో రాహుల్ తాను ప్రయాణిస్తున్న వాహనం దిగి బైక్ పై బయలుదేరారు. కాంగ్రెస్ యువరాజుతో పాటు.. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలెట్ సైతం మరో బైక్ మీద వెళ్లారు. అయినా పోలీసులు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అక్కడ ఉంచి బస్సులో తరలించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారి బాధల్ని నేరుగా తెలుసుకోవాలనుకున్న రాహుల్ లక్ష్యం నెరవేరకుండా చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.

రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఓ బస్సులో ఎవరికీ తెలియని గుర్తు తెలియని రహస్య ప్రదేశానికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమ అగ్ర నేతను యూపీ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. తమ నేతను రహస్య ప్రదేశానికి తరలించాల్సిన అవసమేంటని కాంగ్రెస్ వర్గాలు పోలీసులను ప్రశ్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  arrest  kidnap  Pipliamandi  Mandsaur  Congress  Narendra Modi  Madhya Pradesh  Kamal Nath  Digvijay Singh  

Other Articles