Beef fry breakfast to MLAs in Kerala assembly అసెంబ్లీ సాక్షిగా బీప్ అరగించిన ఎమ్మెల్యేలు..

Beef fry for breakfast before mlas debate new cattle slaughter rules

Beef, Kerala, beef ban, beef fry, Kerala MLA, beef fry for breakfast, Kerala legislators, cattle slaughter, Kerala Assembly, Centre's notification, Pinayari Vijayan, V S Achuthanandan, cattle trade

Kerala Assembly convened for a special one-day session to discuss the Centre's notification on sale and purchase of cattle from animal markets for slaughter, the MLAs enjoyed beef fry in their breakfast.

అసెంబ్లీ సాక్షిగా బీఫ్ అరగించిన ఎమ్మెల్యేలు..

Posted: 06/08/2017 05:18 PM IST
Beef fry for breakfast before mlas debate new cattle slaughter rules

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏకంగా పశువధను వ్యతిరేకిస్తూ కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకురాగా, వాటిని వ్యతిరేకిస్తూ అనే రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంక్షలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి విజయన్ ప్రధాని నరేంద్రమోడీకి ఘాటలు లేఖ రాశారు. అంతటితో అగకుండా ఏకంగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో వ్యతిరేక తీర్మాణాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో కొంత వినూత్నంగా ప్రజా వ్యతిరేకతతో పాటు తమ వ్యతిరేకతను కూడా సింబాలిక్ గా చూపేందుకు కాబోలు కొంత వినూత్నతను పాటించారు. కేరళ అసెంబ్లీ క్యాంటీన్ లో బీఫ్ ఫ్రైను ప్రత్యేకంగా తయారు చేశారు. ఎమ్మెల్యేలంతా బీఫ్ ఫ్రైని ఆరగించి, ఆ తరువాత అసెంబ్లీలో బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు లోనికెళ్లారు. దీనిపై క్యాంటీన్ సిబ్బంది మాట్లాడుతూ, బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఉండడంతో ఎమ్మెల్యేలంతా వస్తారని భావించి... పది కేజీల బీఫ్ ను తీసుకొచ్చి బాగా వండామని చెప్పారు. తాము చేసిన బీఫ్ ఫ్రైను ఆరగించిన తరువాతే ఎమ్మెల్యేలు చర్చకు వెళ్లారని చెప్పారు.

ఇక అటు అసెంబ్లీ సమావేశంలో పశువధపై కేంద్రం తీసుకువచ్చిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. పాలివ్వని అవులను పోషించాలంటే ఏడాదికి నలబై వేల రూపాయల మేర ఖర్చు అవుతుందని.. అసలే కరువుకటకాలతో అల్లాడుతున్న పేద రైతులు వాటినెలా పోషిస్తారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో అనేక మంది మాంసాహారులు ఉన్న నేపథ్యంలో వారు ఇష్టమైన ఆహారం తినకుండా అడ్డుకోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beef  Kerala  beef ban  beef fry  Kerala MLAs  breakfast  cattle slaughter  Kerala Assembly  cattle trade  

Other Articles