Rain water pours into Jagan's chamber in assembly

Rainwater in ys jagan s chamber in amaravati assembly

Jagan Chamber, YS Jagan Chamber, Amaravati Secretariat Water, Amaravati Rain Water, Jagan Insult Chamber, YS Jagan Chamber Sentiment, YS Jagan Chamber Bad Sentiment, Flood Water Jagan Chamber, Assembly Water Leakage, YSRCP Rain Water, YSRCP Jagan Chamber TDP, Chandrababu Naidu Jagan Chamber, Velagapudi Secretariat, AP Assembly rain Water, Jagan Assembly Chamber

Heavy Rain In AP. Opposition Leader YS Jagan Chamber Filled With Flood Water In Amaravati assembly. YSRCP Slams TDP and Chandrababu Naidu.

జగన్ విషయంలోనే ఎందుకిలా?

Posted: 06/07/2017 11:26 AM IST
Rainwater in ys jagan s chamber in amaravati assembly

కోట్ల రూపాయల వ్యయం(180 కోట్లు పైమాటే).. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉన్న కంపెనీలు(షాపూర్జీ, ఎల్ అండ్ టీ) కట్టిన నిర్మాణం.. ఒక్క వర్షానికే డ్యామేజీ, నీటి లీకేజీ. ఇది అమరావతి సాక్షిగా కొత్త సచివాలయంలో చోటు చేసుకున్న వైనం. నల్లరేగడి నేలలో నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదంటూ తొలినాటి నుంచే వాదిస్తున్న వస్తున్న ప్రతిపక్ష వైసీపీ చేతికి పదునైన ఆయుధం దొరికినట్లయ్యింది. పోయి పోయి అధినేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోనే జరగటంతో ఇష్యూ మరింత సీరియస్ అవుతోంది.

నిజానికి నిర్మాణాల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని గతంలో చంద్రబాబు చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అలాంటప్పుడు ఇంత త్వరగా ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొందన్నది పలువురి ప్రశ్న. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. జగన్-ఛాంబర్ విషయంలోనే ఇప్పటిదాకా చాలాసార్లు విమర్శలు వచ్చాయి. తొలినాళ్లలో అసెంబ్లీ ప్రారంభం తర్వాత అసలు జగన్ కు ఛాంబర్ కేటాయించలేదు. తర్వాత టాయ్ లెట్ పక్కన ఇచ్చారన్న మరో విమర్శ. ఇప్పుడేమో.. జగన్ ఛాంబర్ నుంచే వర్షం లీకేజీ అవ్వటం.

భారీ వర్షం కారణంగా సెక్రటేరియట్ లోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కానీ, జగన్ కార్యాలయంలోకి మాత్రం పై నుంచి నీరు సన్నటి ధారగా కారింది. అయితే, వర్షపునీరు చేరడానికి కిటీకీలు తెరిచిఉండడమే కారణమని సిఆర్డీఎ కమిషనర్ శ్రీధర్ చెబుతుండగా, పైకప్పు దెబ్బతినడం వల్ల జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు వచ్చిందన్నది అసలు మ్యాటర్. ఏది ఏమైనా చిన్న వర్సానికే అసెంబ్లీ ప్రాంగణం గోడ కూల్చేసి నీటిని బయటకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మీడియాను లోపలికి తీసుకెళ్లి మొత్తం వ్యవహారాన్ని, లోపలి పరిస్థితులను కవరేజీ చేయించేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Secretariat Chamber  Rain Water  

Other Articles