BJP Don't wants to make everyone vegetarian says Venkaiah Naidu

Venkaiah naidu says he was a pure non vegetarian

Venkaiah Naidu, Venkaiah Naidu Non Vegetarian, Venkaiah Naidu Prakash Karat, Prakash Karat Indian Army, Rawat General O'Dwyer, Venkaiah Naidu Cattle Ban, Cattle Ban India, Kashmir Pellets Venkaiah Naidu, prakash Karat Support Pak Terrorist, Indian Army Venkaiah Naidu

Union Minister Venkaiah Naidu slams CPM Leader Prakash Karat for 'finding faults' with Indian Army. Food is matter of choice, I am myself non-vegetarian he added.

మాంసం తింటే తప్పేంటి?-కేంద్ర మంత్రి

Posted: 06/07/2017 10:49 AM IST
Venkaiah naidu says he was a pure non vegetarian

బీఫ్ బ్యాన్ పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగతా వాటిలో నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతూ వస్తున్నాయి. అయితే ఎవరు ఏం తినాలన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందంటున్నాడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మాంసాహారినేనని చెప్పుకొచ్చాడు.

అయితే భారతీయులను శాకాహారులుగా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్ విమర్శలు గుప్పించాడు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన అసహనం వ్యక్తం చేశాడు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకూ మాంసాహారినేనని స్పష్టం చేశారు. వామపక్ష నేతల వాదన అర్థరహితమన్న వెంకయ్య ఏదో ఒక విమర్శతో వార్తల్లో నిలవటమే పనిగా కొందరు పెట్టుకున్నారంటూ విరుచుకుపడ్డాడు.

ఇక జమ్ములో సైనికులపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులపై సానుభూతి కురిపిస్తూ కారత్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించాడు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను వదిలేసి, పరోక్షంగా ఉగ్రవాదాన్ని, ప్రభుత్వంపై యుద్ధాన్ని చేస్తున్న వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం ఏంటంటూ ప్రశ్నించాడు. పార్థా చటర్జీ, ఆర్మీ ఛీఫ్ రావత్ ను జనరల్ డయ్యర్ తో పోల్చటాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. అయితే ఓవైపు పశువధపై దేశంలో చర్చ జరుగుతున్న వేళ, వెంకయ్య నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Prakash Karat  on Vegetarian  Cattle Ban  Indian Army  

Other Articles