శీర్షక చూసి షాక్ అవుతున్నారా..? కానీ ఇది నిజం.. సల్మాన్ ఖాన్ పై అయన భర్యా మరుగుతున్న నీటిని పోసి మరీ తన ప్రతాపాన్ని చూపింది. అదేంటి సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాలేదు కదా..? అంటారా.. ఇయన ఉత్తర్ ప్రదేశ్ లోని అలిగఢ్ ప్రాంతానికి చెందిన ఓ పండ్ల విక్రేత. ఈయనకు ఆరు మాసాల క్రితం స్థానిక యువతి నగ్మాతో వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సక్యత వున్నా.. కేవలం రెండు అంశాల్లో మాత్రం నిత్యం పోరు జరిగేది. ఒకటి సల్మాన్ ఖాన్ గడ్డం.. రెండు అతను ధరించే కుర్తా ఫైజామా. అదేంటి అంటారా..
తన భర్త ఆదాయానికి తక్కువ కావచ్చు కానీ.. అందంలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాలనుకుని ప్రతి భార్య భావిస్తుంది. అందరిలా తన భర్త కూడా అందంగా తయారైతే.. తాను అయనతో పాటు అలా సరదాగా షికారుకు వెళ్తే ముచ్చటైన జంట అంటూ పలువురు ప్రశంసిస్తుంటే.. విని సంతోషించాలన్న భార్య మనస్సును అర్థం చేసుకోని భర్తలు చిరాకుతో.. ఇక చాలు.. నన్ను వేధించకు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు. కానీ నన్ను మాత్రం అలా వుండు ఇలా వుండు అని ఇబ్బంది పెట్టకు అంటారు భర్తలు. సరిగ్గా సల్మాన్ ఖాన్, నగ్మా విషయంలోనూ అదే జరిగింది.
సల్మాన్ ఖాన్ ను పెళ్లైన నాటి నుంచి అతని భార్య నగ్మా తన భర్తను గడ్డం చేసుకుని అందంగా కనిపించాలని కొరుతూ వచ్చింది. అయితే తాను గడ్డం సరదాగా పెంచుకోవడం లేదని, ఇస్లాం మత అచారంగా తనాు గడ్డం పెంచుకుంటున్నానని గడ్డం తీసేందుకు నిరాకరించాడు సల్మాన్ ఖాన్. అయినా అరు నెలలుగా భర్త వెంటపడి మరీ గెడ్డం తీసేయండీ అంటూ భార్య పలుమార్లు కోరింది. అందుకు సల్మాన్ నిరాకరిస్తూ వస్తున్న సల్మాన్ ను చివరగా శుక్రవారం కూడా అదే విషయాన్ని కోరింది. ఈ విషయంలో వారిమద్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నగ్మా భర్తపై మరుగుతున్న నీళ్లు పోసింది.
దీంతో తీవ్ర గాయాల పాలైన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్తను అందంగా తయారు చేసుకోవాలని భావించి భంగపడిన భార్య నగ్మపై పోలీసులు హత్యయత్నం కింద కేసు నమోదు చేశారు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహమైందని, అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిపారు. తన భర్త కుర్తా పైజామాలు ధరించడం ఇష్టంలేని భార్య.. అయనను ఫ్యాంటు, షర్టు ధరించాలని కూడా ఒత్తిడి చేసిందని పోలీసులు తెలిపారు. మారుతున్న కాలంతో పాటు తన భార్య మాటలను కూడా అలకించి వుంటే సల్మాన్ ఖాన్ కు ఇలాంటి కష్టం వచ్చేది కాదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more