DRI arrests national-level shooter Prashant Bishnoi వన్యప్రాణి ద్రోహీ: వీడు షూటర్ కి తక్కువ.. స్మగ్లర్ కి ఎక్కువ..

Shooter prashant bishnoi reveals how he smuggled weapons through airports

Shooter Prashant Bishnoi, Prashant Bishnoi, Prashant Bishnoi arrest, Directorate of Revenue Intelligence, DRI, wildlife smuggling, prashant bishnoi raid, National level shooter arrested, mp wildlife smuggling case, attack on wildlife, arms smuggling, crime

The Directorate of Revenue Intelligence (DRI) has arrested national-level shooter Prashant Bishoi, the absconding accused in Meerut arms and wildlife trophies seizure case.

వన్యప్రాణి ద్రోహీ: వీడు షూటర్ కి తక్కువ.. స్మగ్లర్ కి ఎక్కువ..

Posted: 06/03/2017 12:37 PM IST
Shooter prashant bishnoi reveals how he smuggled weapons through airports

జాతీయ స్థాయి షూటర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రశఆంత్ బిష్ణోయ్.. దేశానికి పేరు తీసుకువస్తాడని భావించగా, దేశద్రోహానికే పాల్పడ్డాడు. అక్రమ మార్గంలో అదాయాన్ని సంపాదించాలని ఏకంగా విమానాశ్రయ అధికారులను తన వద్ద అనుమతులు వున్నాయంటూ బురిడీ కొట్టించి దేశంలోకి అదునాథన అయుధాలను దిగుమతి చేసుకుని వన్యప్రాణులను వేటాడి చంపి వాటి చర్మం, ఇతర అవయవాలను విదేశాలకు స్మగ్లింగ్ చేసి కాసులు గడించి..ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

సరైన అనుమతులు ల్లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన 25 మారణాయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠాను గత ఏప్రిల్ 29న ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో వున్న నిందితులను విచారించగా, వారిచ్చిన సమాచారంతో మీరట్ లోని జాతీయ షూటర్ ప్రశాంత్ బిష్ణోయ్ నివాసంలో అప్పుడే సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కోటి రూపాయల నగదు, విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఇంపోర్టెడ్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 117 కేజీల మనుబోతు మాంసం, కొమ్ములు, చిరుతపులి, కృష్ణజింకల చర్మాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ బిష్ణోయ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆయుధాల అక్రమ రవాణా చేయడంతో పాటు అదే సమయంలో స్మగ్లింగ్ ముఠాలకు వాటిని విక్రయించి దేశం దాటిస్తానని ప్రశాంత్ బిష్ణోయ్ అంగీకరించాడు. ఇక అత్యంత వేగంగా పరిగెత్తే చిరును కూడా చంపానని, దాంతో పాటు అనేక వన్యప్రాణుల ప్రాణాలు తీసి వాటి అవయావాలను అమ్మి కూడా సొమ్మ చేసుకున్నట్లు అంగీకరించాడు. తనకు అమిత్ గోయల్, అనీల్ లంగన్, స్లోవెన్యన్ దేశస్థుడైన డోరిస్ సొబోటిక్ సహకరించారని తెలిపాడు.  అక్రమ రవాణా (స్మగ్లింగ్‌) తో పాటు వన్యప్రాణులను వేటాడాన్న నేరాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కొర్టులో హజరుపర్చాగా, న్యాయస్థానం బిష్ణోయ్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles